కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అందుకే.. శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు ఇప్పటినుంచే.. జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలామంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్.. కొలెస్ట్రాల్ అనేది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు మరింత కారణమవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ రెండు రకాలు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 50mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎల్లప్పుడూ 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం..
హై కొలెస్ట్రాల్ కారణంగా గుండె సంబంధిత సమస్యలతో పాటు.. అనేకసమస్యలు వచ్చే ప్రమాదముంది.. కావున చెడు కొలెస్ట్రాల్ స్థాయిని సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆహారాలను.. మీ రోజువారీ అల్పాహారంలో చేర్చుకోవడం చాలామంచిది.. తద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
వాల్‌నట్‌లను తినండి: ప్రతిరోజూ మీ అల్పాహారంలో కొన్ని వాల్‌నట్‌లను తినండి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బాదం: బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆలివ్ నూనెతో ఆహారం తయారు చేసుకోండి: ఆలివ్ నూనెతో వంట చేయడం చాలా మంచిది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. కావున అల్పాహారం ఆలివ్ నూనెతో తయారు చేసుకుని తినండి.
అల్పాహారంలో అవిసె గింజలను తినండి: అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అవిసె గింజల పొడిని వరుసగా 3 నెలల పాటు ఉదయం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
మార్నింగ్ వాక్: మార్నింగ్ వాక్ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను 5 శాతం పెంచుతుంది.
ఆరెంజ్ జ్యూస్: ఉదయం పూట ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. నారింజలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. 750 మి.లీ నారింజ రసాన్ని ఉదయం పూట 4 వారాల పాటు నిరంతరం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
ఒక నెల పాటు ఉదయాన్నే అల్పాహారంలో మార్పులు చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుందని.. అధిక బరువు సమస్య కూడా అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఫాలో అయ్యేముందు డైటీషియన్లను సంపద్రించండి)