చలికాలంలో అంటు రోగాలతోపాటు జుట్టు సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. ఇందులో జుట్టు పొడిబారడం, చుండు పెరిగిపోవడం జరుగుతుంది. ఇది జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. నిజానికి చలికాలంలో చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. కానీ దానిని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. మీరు కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.
నిమ్మరసం –
చుండ్రును వదలించుకోవడానికి నిమ్మరసం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. సాధారణ నూనెతో నిమ్మరసాన్ని ఉపయోగించండి. కొబ్బరి నూనెలో కొన్ని నిమ్మ చుక్కల కలపండి. దీన్ని మీ తలపై అప్లై చేయండి. 3 నుంచి 5 నిమిషాలు మసాజ్ చేయండి. 1 గంట అలాగే ఉంచి కడగాలి.
మీ షాంపూతో –
రెగ్యులర్ షాంపూ వాడుతున్నట్లైతే.. కొన్ని చుక్కల ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ లేదా పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్‌ని జోడించి దానిని ఉపయోగించవచ్చు.
యాంటీ డాండ్రఫ్ షాంపూ –
చుండ్రును వదిలించుకోవడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో పుదీనా ఉంటుంది. ఇది తేలికపాటి చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. కానీ చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే అది ఎటువంటి మెరుగైన ప్రభావాన్ని చూపదు.
వేప హెయిర్ ఆయిల్ ఉపయోగించండి –
జుట్టు కోసం వేప హెయిర్ ఆయిల్ ఉపయోగించండి. తల దురద, చుండ్రు నుండి ఉపశమనం పొందడానికి వేప జుట్టు నూనె బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలను కడగాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..