
పీరియడ్స్.. ప్రతి మహిళకు సాధారణమే అయినా.. ఆ సమయంలో కలిగే బాధ భరించరానిదిగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు దానిని వద్దు అనుకుంటారు. కానీ అది స్త్రీ తత్వానికి ప్రతీక కావడంతో వచ్చి తీరుతుంది. ఒకవేళ సమయానికి నెలసరి రావడం లేదు అని గుర్తిస్తే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందే. అయితే చాలా మంది మహిళలు ప్రతి నెల పీరియడ్స్ మొదలైన డేట్ లను పెద్దగా పట్టించుకోరు. అదే వస్తుంది. అదే పోతుందన్న భావనతో ఉంటారు. అయితే అది సరి కాదని నిపుణులు చెరబుతున్నారు. రుతు చక్రాన్ని ప్రతి మహిళ మార్క్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెలలో పీరియడ్స్ వచ్చిన డేట్ ని నోట్ చేసుకొని.. రోజులను లెక్కించాలని సూచిస్తున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా ఒకసారి పీరియడ్స్ వచ్చి.. మరో సైకిల్ ప్రారంభమవడానికి దాదాపు 28 రోజులు పడుతుంది. కొందరిలో ఒకటి రెండు రోజులు పెరగవచ్చు. తగ్గవచ్చు కూడా. అయితే ఇలా డేట్ ను ఎందుకు నోట్ చేయాలి. రుతుచక్రాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటి లాభం? దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి? దీనిపై నిపుణులు చెబుతున్న వివరణ ఇది..
మహిళలు గర్బధారణకు ప్రయత్నిస్తున్నట్లయితే తప్పనిసరిగా వారు పీరియడ్స్ డేట్ ను నోట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మహిళల్లో అండం విడుదలయ్యే సమయంలో కలయిక ఉంటేనే గర్భధారణకు అవకాశం ఉంటుంది. సాధారణంగా పీరియడ్స్ మొదలైన 12 నుంచి 14 రోజులకు అండం విడుదల అవుతుంది. ఈ టైం లో భార్యభర్తలు కలిస్తే గర్భం దాల్చే అవకాశాలు మెరుగవుతాయి. అలాగే గర్భం వద్దు అనుకన్న వారు కూడా ఈ రోజులలో కలవకుండా ఉంటే సరిపోతోంది. ఇది కచ్చితంగా తెలియాలి అంటే తప్పనిసరిగా మీ పీరియడ్స్ సైకిల్ ని లక్కించాల్సిందే.
నెలలో మీ పీరియడ్స్ డేట్ మీకు తెలిస్తే.. మానసికంగా మీరు సిద్ధమవుడానికి అది సాయపడుతుంది. ఆ సమయంలో సాధారణంగా మూడ్ స్వింగ్స్, విపరీతమైన కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవచ్చు.
మీ రుతు చక్రాన్ని మీరు మార్క్ చేసుకుంటే అది సరియైన సమయానికి వస్తుందా లేదా అని తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్స్ త్వరగా లేదా ఆలస్యంగా రావడం జరుగుతుంది. మీ పీరియడ్ సైకిల్ ని నోట్ చేసుకుంటే ఈ విషయం మీకు అర్థం అవుతుంది. అప్పుడు తక్షణమే వైద్య సహాయం పొందే వీలుంటుంది.
మీ పీరియడ్స్ ని ట్రాక్ చేసుకుంటే.. మీ భవిష్యత్ ప్రణాళికలు డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్, లేదా సహోద్యోగులతో టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ పీరియడ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే మీరు ముందే మీ సైకిల్ ని మార్క్ చేసుకుంటే ఆరోజుల్లో టూర్ లేకుండా చూసుకోవచ్చు.
మీ పీరియడ్స్ ను ట్రాక్ చేయడానికి చాలా రకాల పద్దతులు ఉన్నాయి. వాటిల్లో సాధారణంగా అందరూ ఉపయోగించే విధానం డేట్ మార్కింగ్. పీరియడ్ మొదలైన రోజును కేలండర్ మార్క్ చేసుకొని, రోజులు లెక్కపెట్టడం. దీని ద్వారా వచ్చే సైకిల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో మీకు ఉజ్జాయింపుగా తెలుస్తుంది. అప్పుడు మీరు మానసికంగా దానికి సిద్ధపడవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..