Heart Attack
Heart attack risk factors: ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గుండె వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలంటే గుండె ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల గుండెను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. దీంతో ఈ సమస్యలు మరింత పెరుగుతున్నాయి. గుండెపోటు రాకూడదనుకుంటే కొన్ని చెడు అలవాట్లను ఈరోజు నుంచే వదిలేయాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలాంటి వారికి గుండెపోటు ప్రమాదం అధికం..
- ఊబకాయం లేదా బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడే వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటారు.
- మీ కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధులుంటే.. అలాంటి వారికి కూడా ప్రమాదం ఉంటుంది.
- అధిక రక్తపోటుతో బాధపడే వారికి గుండెపోటు రావచ్చు.
- శారీరక శ్రమ లేకపోయినా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ అలవాటును వెంటనే మార్చుకోండి.
- తగినంత నిద్ర లేని వారికి గుండె జబ్బులు వస్తాయి.
- సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తినే సమయాన్ని మార్చుకోవడం ప్రమాదకరం.
- వైద్యులను సంప్రదించకుండా మందులు వాడేవారు.
- గుండె వేగంగా కొట్టుకోవడం, నెమ్మదిగా కొట్టుకోవడం కూడా ప్రమాదమే..
గుండెపోటును నివారించే మార్గాలు
- గుండెపోటు రాకూడదని మీరు కోరుకుంటే.. ముందుగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. ఫైబర్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినండి.
- ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. చాలా హానికరమైన కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతుంది. అందుకే నూనె పదార్థాలను, బయటి తిండిని తినడం మానుకోండి.
- మీరు రోజువారీ జీవితంలో వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే.. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మీ బరువును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. బరువును నియంత్రించడానికి అన్ని చర్యలను అనుసరించండి. పొట్ట కొవ్వు (బెల్లీ ఫ్యాట్) పెరగడం గుండెకు మంచిది కాదు.
- ధూమపానం, మద్యపానం లాంటివి వెంటనే మానేయండి. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు మన జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది.
- ఎక్కువ ఉప్పు అంటే సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. ఇది రక్తపోటును పెంచుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: