Heart Attack: లేత వయసులోనే పిట్టల్లా రాలుతున్న పసి పిల్లలు.. గుండె జబ్బులు గుర్తించడం ఎలా?

చిన్న వయసులోనే గుండె పోటు.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నారు. డ్యాన్స్ చేస్తూ కొంత మంది.. కూర్చున్న చోటే కొంత మంది గుండె పోటుతో నేల రాతిపోతున్నారు. అందులో ఎక్కువగా యువతే ఉండడం ఆందోళన కలిగిస్తుంది.చిన్నా-పెద్దా, స్త్రీ- పురుషులు అనే తేడాలు లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ప్రాణాలు విడుస్తున్నారు

Heart Attack: లేత వయసులోనే పిట్టల్లా రాలుతున్న పసి పిల్లలు..  గుండె జబ్బులు గుర్తించడం ఎలా?
Heart Attack In Children

Edited By: Balaraju Goud

Updated on: Feb 16, 2025 | 2:55 PM

చిన్న వయసులోనే గుండె పోటు.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నారు. డ్యాన్స్ చేస్తూ కొంత మంది.. కూర్చున్న చోటే కొంత మంది గుండె పోటుతో నేల రాతిపోతున్నారు. అందులో ఎక్కువగా యువతే ఉండడం ఆందోళన కలిగిస్తుంది.చిన్నా-పెద్దా, స్త్రీ- పురుషులు అనే తేడాలు లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ప్రాణాలు విడుస్తున్నారు

చిన్న పిల్లలు మొదలు 18 నుండి 25 ఏళ్ల మధ్య యువత వరకు, శారీరకంగా ధృడంగా ఉండే వారు, రాజకీయవేత్తలు, జిమ్ చేసే యువత, క్రీడాకారులు, అప్పటి దాకా ఎలాంటి గుండెజబ్బు సమస్యలు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో కుప్పకూలుతున్నారు. కొన్నిరోజుల క్రితం గుజరాత్లో ఎనిమిదేళ్ల బాలిక తరగతి గది కారిడార్‌లో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో విగతజీవిలా వాలిపోయింది. ఆ దృశ్యాలు స్కూల్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

ఇటీవల చిన్న పిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నట్లుగా గత మూడు, నాలుగు నెలలుగా చోటు చేసుకున్న వివిధ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వీరే కాకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే వయసుతో తేడా లేకుండా కొందరు హఠాత్తుగా వస్తున్న గుండె పోటుతో మరణించారు. లోకం తెలియని చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిలిస్తోంది.

అయితే హఠాత్తుగా గుండె ఇబ్బుతో చనిపోవడం అంటూ ఉండదని, పుట్టినప్పటి నుంచే అంటే.. గర్భస్తస్థితి నుంచే గుండెజబ్బులకు సంబంధించిన లక్షణాలతో ఈ ప్రాణాంతక ముప్పును గుర్తించవచ్చునని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చిన్న పిల్లల్లో గుండెజబ్బుకు సంబంధించి కొన్ని లక్షణాలను ముందు నుంచే గుర్తించవచ్చునని, వారి శరీర రంగు ముఖ్యంగా పెదాలు, చేతులు నీలంరంగులోకి మారడం వంటివి గమనించాలని చెబుతున్నారు. సాధారణంగా చిన్నవయసులో ఉన్నప్పుడే శ్వాశకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయని, అంతకు మించిన సంఖ్యలో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చిన్నారుల వయసుకు తగ్గట్టుగా తగినంతగా బరువు పెరగకపోవడం, నాలుగు నెలల వయనప్పుడు మందహాసం (నార్మల్ సైక్టైల్), ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం వంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉందొచ్చునని, ముందస్తుగా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచే వారి గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ‘2 డీ ఎకో ఈసీజీ ఇతర పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందిస్తే సడన్ హార్ట్ ఎటాక్ వంటి వాటిని నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

రాత్రి సమయాల్లో ఎవరికైనా గుండెలో నొప్పిగా అనిపిస్తే దానిని ఎసిడిటీగా కొట్టిపారేసి నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఇలా గుండె నొప్పికి, అసౌకర్యానికి గురయితే వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో ఈసీజీ, రక్త పరీక్షలు, సీటీ స్కాన్ చేయించుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చునని వైద్యులు అంటున్నారు. గుండెపోటు వచ్చాక 4 నుంచి 6 గంటలు గోల్డెన్ పీరియడ్ వంటివి ఈ సమయంలోగా ఆసుపత్రికి చేరుకుంటే ప్రమాదంనుంచి తప్పేందుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. నిద్రించే సమయాల్లోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆరోగ్యమైన గుండె కలవారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అనేది అత్యంత అరుదంటున్నారు వైద్యులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..