Hearing Problem: ఆ అలవాట్లు మానుకోకపోతే.. మీకు చెవుడు రావడం ఖాయం..!

|

Apr 21, 2022 | 5:53 PM

ఈ మధ్య చాలా మంది చెవిలో హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని ప్రపంచాన్నే మారిచిపోతున్నారు. ఎప్పుడు చూసినా చెవుల్లో ఇయర్‌ఫోన్స్(Earphones) దర్శనమిస్తున్నాయి...

Hearing Problem: ఆ అలవాట్లు మానుకోకపోతే.. మీకు చెవుడు రావడం ఖాయం..!
Hearing Problem
Follow us on

ఈ మధ్య చాలా మంది చెవిలో హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని ప్రపంచాన్నే మారిచిపోతున్నారు. ఎప్పుడు చూసినా చెవుల్లో ఇయర్‌ఫోన్స్(Earphones) దర్శనమిస్తున్నాయి. ఇలా వారు ఎక్కువగా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సౌండ్‌(Sound) ఎక్కువగా పెట్టుకోవడంతో చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెవుడు వచ్చే ప్రమాదం ఎక్కవే.. ఇదే కాకుండా కొన్ని అలవాట్ల కారణంగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెవులను తడిగా ఉంచుకోవడం వల్ల చెవుడు వచ్చే అవకాశం ఉంది. మీరు తరచుగా చెవులను తడిగా ఉంచుకోవడం వల్ల చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ (Automisis) వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా ఈతగాళ్లలో కనిపిస్తుంది.

చెవిలో ఇన్ఫెక్షన్‌కు కారణం ఆస్పర్‌గిల్లస్, కాండిడా అనే బ్యాక్టీరియా. ఇది తేమ కారణంగా వేగంగా వ్యాపిస్తుంది. వినికిడి లోపం సమస్య ఉన్నప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎక్కువ సౌండ్ తో టీవీ చూడటం. రేడియో లేదా పాటలను ఎక్కువ సౌండ్‌తో వినడం. సంభాషణలను వినడంలో.. అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడడం.

చెవి నుంచి తెలియని శబ్దం వస్తున్నట్లు అనిపించడం. ఫోన్‌లో వినికిడి లోపం.. బిగ్గరగా మాట్లాడటం వంటి లక్షణాలు వినికిడి లోపాన్ని సూచిస్తాయి. కుటుంబంలో పెద్దల జన్యుపరమైన సంక్రమణ ద్వారా కూడా చెవుడు వస్తుంది. చెవిలో జివిలి తీయడానికి ఇయర్‌ బండ్స్ వాడుతుంటారు. ఈ అలవాటు కూడా చెవుడికి కారణం అవుతుంది. సాధరణంగా జివిలి ఏం చేయకున్నా రాలిపోతుంటుంది.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Fatty Liver: మహిళలకు అలర్ట్.. పెగ్నెన్సీ సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి