అనేక వ్యాధులకు కారణం మనం తీసుకునే ఆహారం, ఇతర పానీయాలే. మధుమేహం, థైరాయిడ్, కీళ్లనొప్పులు వంటి వ్యాధులు ఇప్పుడు ప్రజలలో సాధారణమైపోయాయి. థైరాయిడ్ వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి మెడ వెనుక భాగంలో ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే థైరాయిడ్ రావడానికి కారణం ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి? రోగుల ఆహార ప్రణాళిక ఎలా ఉండాలి. వీటి గురించి తెలుసుకుందాం.
థైరాయిడ్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపోథైరాయిడిజం, మరొకటి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజమ్‌ను అండర్‌యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. థైరాయిడ్ హార్మోన్ తగినంత మొత్తంలో లేనప్పుడు ఇది జరుగుతుంది. దీని కారణంగా మనిషి సన్నబడటం జరుగుతుంది. హైపర్ థైరాయిడిజం అంటే శరీరంలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అంతే కాకుండా ఆహారంలో ఐరన్ లోపించినా గాయిటర్ లాంటి సమస్య వస్తుంది.
పురుషుల కంటే మహిళలకు థైరాయిడ్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి 30 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..