Fertility Problems: వివాహిత జంటకు సంతానం కలుగడం కంటే పెద్ద అంశం మరోటి ఏదీ లేదు. అయితే, ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, అసంబద్ధమైన జీవినశైలి కారణంగా స్త్రీ, పురుషులు ఇరువురూ సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దంపతులు ఈ సమస్య పరిష్కారం కోసం వైద్యుల వద్దకు పెరుగెడుతూ తమ సమయాన్ని, డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. అయితే, గర్భం దాల్చడంలో సమస్య ఎదురవగానే వైద్యుల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారి సమస్యను వారే పరిష్కరించుకునే మార్గాలు అనేకం ఉన్నాయంటున్నారు. వాటిలో ప్రధానంగా యోగా.. గర్భధారణకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుందంటున్నారు. సంతానోత్పత్తి సమస్యలను నివారించడంలో యోగా అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. మరి స్త్రీలు, పురుషుల సంతానోత్పత్తిని పెంచే యోగాసానాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
సూర్య నమస్కారం..
ఈ యోగా ఆసనం మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యల నుండి విముక్తి పొందడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం రుజువు అయ్యింది. ఋతుస్రావం సమయంలో పొత్తికడుపు తిమ్మిరిని తగ్గించడానికి సూర్య నమస్కారం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. స్త్రీల గర్భాశయంపై మెనోపాజ్ ప్రభావం, ప్రసవ సమయంలో కూడా యోగాసనాల ప్రభావం మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సూర్య నమస్కారం మీ సెక్స్ గ్రంథులకు నష్టం కలుగకుండా, మరింత శక్తివంతం చేస్తాయి.
సీతాకోకచిలుక భంగిమ..
సీతాకోకచిలుక భంగిమ లోపలి తొడలు, తుంటి, మోకాళ్ల కండరాలను విస్తరింపజేస్తుంది. అదే సమయంలో, ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సీతాకోకచిలుక ఆసనం రోజూ చేయడం వలన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రసవ సమయంలో మహిళలు అనుభవించే తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో కూడా ఈ ఆసనం ప్రభావవంతంగా ఉంటుంది.
పశ్చిమోత్తనాసనం..
ఈ ఆసనం మీ శరీరంలోని కండరాలను సాగదీస్తుంది. పశ్చిమోత్తనాసనం చేయడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.
బాలాసన్..
సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యల నుండి బయటపడటానికి బాలసన్ స్త్రీలకు, పురుషులకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి యోగాసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా, ఈ ఆసనం చేయడం వల్ల మీ వీపు, మోకాళ్లు, తుంటి, తొడల కండరాలు సాగవుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..