Health Tips: పిండి పదార్థాలను అతిగా తింటే ఏమవుతుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
Health Tips: ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఇష్టానుసారంగా ఆహారాలు తీసుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ద పెట్టకపోతే ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలున్నాయని..
Health Tips: ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఇష్టానుసారంగా ఆహారాలు తీసుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ద పెట్టకపోతే ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహిస్తున్నారు. ఆహార నియామాలు పాటిస్తున్నారు. అయితే చాలా మందికి పిండి పదార్థాలు (Carbohydrates) అంటే ఎంటే ఎంతో ఇష్టం. ఇవి శరీరానికి కూడా ఎంతో అవసరం. కానీ అతిగా తింటే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిండిపదార్థాల మోతాదు ఎక్కువైనప్పుడు శరీరం పంపే సంకేతాలను పరిశీలించాలని చెబుతున్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. శరీరంలో పిండి పదార్థాలు అదనంగా వచ్చి చేరుతుంటే మొదట బరువు పెరుగుతూ ఉంటారు. దీనికి వెంటనే గుర్తంచాలంటున్నారు నిపుణులు. లేకపోతే ఊబకాయం సమస్య ఎదుర్కోవాల్సి రావచ్చు.
పిండి పదార్థాలు అధికంగా తింటే వచ్చే సమస్యలు..
☛ కార్బోహైడ్రేట్లు పెరుగుతున్న కొద్దీ సీరం ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల శరీరంలో ప్రతికూల ప్రభావాలు ప్రారంభమవుతాయి. కాలేయంలో ఎక్కువగా ఇన్సులిన్ తయారవుతుంది. చర్మ సంబంధ వ్యాధులు దరి చేరి ఇబ్బందులకు గురవుతుంటారు.
☛ పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది. దీని కారణంగా అధిక రక్తపోటు వచ్చి ప్రాణానికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.
☛ శరీరంలో కార్బోహైడ్రేట్ల స్థాయి పెరిగినప్పుడు తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలను ఎంచుకోవాలి
☛ మీకు తీపి పదార్థాలు తినాలనే కోరిక ఉందంటే శరీరంలో కార్బోహైడ్రేట్లస్థాయి పెరిగిందని గమనించాలి. తీపి ఎక్కువగా తింటే మధుమేహం బారినపడే ప్రమాదం ఉంది.
☛ పిండి పదార్థాలను నియంత్రించకపోతే జీర్ణక్రియ దెబ్బతిని ఎసిడిటీ సమస్య, పేగు క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
☛ జీర్ణవ్యవస్థ గాడి తప్పితే మలబద్ధకం, కడుపు ఉబ్బరం మొదలవుతాయి. అందుకే పిండి పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి: