Weight-Loss: వారంలో రెండు రోజులు తింటే చాలు.. ఊహించని రీతిలో బరువు తగ్గిపోతారు..!

| Edited By: Anil kumar poka

Aug 14, 2021 | 7:43 PM

Weight-Loss: అధిక బరువు ఎంతో మందిని వేదనకు గురి చేస్తుంటుంది. అధిక బరువు కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

Weight-Loss: వారంలో రెండు రోజులు తింటే చాలు.. ఊహించని రీతిలో బరువు తగ్గిపోతారు..!
Kichidi
Follow us on

Weight-Loss: అధిక బరువు ఎంతో మందిని వేదనకు గురి చేస్తుంటుంది. అధిక బరువు కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వర్కౌట్లు, డైటింగ్ చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే.. మరికొందరు మెడిసిన్స్, ఇంకేవో ప్రయోగాలు చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. మొత్తంగా వారి టార్గెట్ మాత్రం బరువు తగ్గడమే. అయితే, బరువు తగ్గడంలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారం ద్వారానే దాదాపు బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఐదు రకాల కిచిడీ పదార్థాలను తినడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు. మరి ఆ ఐదు రకాల కిచిడీ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పప్పుతో చేసిన ఖిచిడీ..
పప్పుతో చేసిన కిచిడీ(దాల్ ఖిచిడి) చాలా హెల్తీ ఫుడ్. ఖిచిడీ చేయడానికి మీరు మూంగ్ దాల్, టోర్, చనా దాల్ ఉపయోగించవచ్చు. కాయ ధాన్యాలలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది మీ ఆకలిని ఎక్కువ కాలం అదుపులో ఉంచుతుంది. మధుమేహం, గుండె రోగులకు దాల్ ఖిచిడీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖిచిడీలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. వారానికి రెండు రోజులు ఖిచిడీ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు విశ్వసిస్తున్నారు. చాలా మంది ప్రముఖులు తమ ఆహారంలో ఖిచిడీని ప్రధానంగా తీసుకుంటారు.

ఓట్స్‌ మీల్..
వోట్ మీల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వోట్‌ మీల్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా.. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. ఇందులో విటమిన్ బి -6, రాగి, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

ఓట్స్ ఖిచిడీ..
ఓట్స్ ఖిచిడీ అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇందులో మాంగనీస్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. తద్వారా మీకు ఎక్కువసేపు ఆకలి అనిపించదు.

మొక్కజొన్నతో ఖిచిడీ..
మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా మీ పొట్ట చాలా సేపు నిండినట్లుగా ఉంటుంది. తద్వారా త్వరగా ఆకలి అనిపించదు. మొక్కజొన్నను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్లు, గుండెకు మేలు జరుగుతుంది. ఈ ఖిచిడీని మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఖిచిడీలో క్యారెట్లు, బఠానీలు, బీన్స్ యాడ్ చేయొచ్చు.

తణధాన్యాలతో ఖచిడీ..
రాజస్థాన్‌లో దీన్నే బజ్రా ఖిచిడీ అంటారు. అక్కడ ఇది చాలా ఫేమస్. మిల్లెట్స్‌లో ప్రోటీన్లు, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఖిచిడీ తినడం ద్వారా త్వరగా ఆకలి అనిపించదు. రోజూ మిల్లెట్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

Also read: Apps for Farmers: ఈ మొబైల్ యాప్‌లతో రైతులకు ఎంతో మేలు.. ఇవి తెలిపే సమాచారం ద్వారానే రైతులకు..

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..

హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..