Health Tips: వర్షాకాలంలో వీటిని తీసుకోండి.. రోగనిరోధక శక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండండి..

Health Tips: వర్షాకాలంలో అనేక రకాల అంటువ్యాధులు ప్రజలను వేధిస్తాయి. కలుషితమైన నీటి కారణంగా అనేక వ్యాధులు వ్యాపిస్తాయి.

Health Tips: వర్షాకాలంలో వీటిని తీసుకోండి.. రోగనిరోధక శక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండండి..
Tea

Updated on: Jul 02, 2022 | 10:39 PM

Health Tips: వర్షాకాలంలో అనేక రకాల అంటువ్యాధులు ప్రజలను వేధిస్తాయి. కలుషితమైన నీటి కారణంగా అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే చల్ల చల్లటి వాతావరణంలో, వర్షం పడుతుండగా అందరికీ వేడి వేడి పకోడీలు, అల్లం టీ, బజ్జీలు, ఇతర నూనె ఉత్పత్తులను తింటుంటారు. అది కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. ఎసిడిటీ, వికారం, బరువు పెరగడం వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. అందుకే వర్షాకాలంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. పంచదారతో టీ తాగే బదులు లెమన్ గ్రాస్ టీ తాగడం ఉత్తమం. చిప్స్, ఇతర వేయించిన పదార్థాలకు బదులుగా పాప్‌కార్న్ తినడం ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది.

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు..
పాప్‌కార్న్: వర్షాకాలంలో పాప్‌కార్న్ ఎక్కువగా తినాలి. మొక్కజొన్నను తినడం వల్ల గుండెపోటు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

జామకాయ: జామకాయ అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యల నుండి బయటపడేస్తుంది. అంతేకాదు.. యవ్వనంగా, తాజాగా ఉంచుతుంది.

లెమన్‌గ్రాస్ టీ: లెమన్‌గ్రాస్‌లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి క్షణాల్లో ఒత్తిడిని తగ్గించగలవు. వర్షాకాలంలో వచ్చే అనేక ఇన్ఫెక్షన్‌లను నివారించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..