Health Tips: ఉల్లి, వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, సాధారణంగానే అందరూ ఉల్లి, వెల్లుల్లి తోడ్కలను తీసి పడేస్తుంటారు. ఆ గెడ్డలను మాత్రమే వంటలలో వినియోగిస్తుంటారు. అయితే, వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలను ఔషధంగా కూడా వినియోగించవచ్చు. ఎందుకంటే.. ఇందులో విటమిన్ ఏ, ఇ సహా అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కండరాల నొప్పి నుండి ఉపశమనం..
బిజీ లైఫ్‌లో అలసట అనేది సర్వసాధారణంగా మారింది. అయితే, ఈ సమస్య కంటిన్యూగా ఉంటే.. కండరాలలో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో వెల్లుల్లి-ఉల్లిపాయ తొక్కలను మరిగించాలి. ఆ కషాయాన్ని 10 రోజుల పాటు తాగితే.. కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.
తామర నుంచి ఉపశమనం..
వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సంరక్షణలో సహాయకారిగా ఉంటాయి. అంతే కాకుండా ఉల్లిపాయల్లో యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలతో ఉపశమనం పొందవచ్చు. దురద, నొప్పి వంటి చర్మ సమస్యలను వదిలించుకోవడానికి.. వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలను ఒక పాత్రలో వేసి మరిగించాలి. ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకుని.. స్నానం చేయాలి. అలా రోజూ చేయడం వలన చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
నిద్రలేమికి చెక్..
మానసిక ఒత్తిళ్ల కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ నిద్రలేమి కారణంగా శారీరక ఒత్తిడి మరింత పెరిగి, అనేక ఇతర శరీరక సమస్యలు తలెత్తుతాయి. దీనిని స్లీపింగ్ డిజార్డర్ అని కూడా అంటారు. దీని నుంచి ఉపశమనం పొందాలంటే వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలతో చేసిన టీ తాగడం ఉత్తమం. వింతగా అనిపించినప్పటికీ.. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.