Sore Throat Issue: మునుపటి కంటే ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రంగా అధికంగా ఉంది. దీని కారణంగా ప్రజలు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. అవే కాకుంకా ఇతర జబ్బులు కూడా వేధిస్తున్నాయి. ముఖ్యంగా గొంతు నొప్పి సమస్య ప్రధాన సమస్యగా పేర్కొనవచ్చు. చలి తీవ్రత కారణంగా గొంతులో ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడి.. విపరీతమైన నొప్పి వస్తుంది. దీన్నే టాన్సిల్స్ ఉంటారు. ఈ టాన్సిల్స్ కారణంగా.. ఆహారం తినాలన్నా.. నీరు తాగాలన్నా ఇబ్బంది తలెత్తుతోంది. గొంతుకు ఇరు వైపులా ఉండే గ్రంథులనే టాన్సిల్స్ అంటారు. శరీరాన్ని బయటి ఇన్‌ఫెక్షన్ల నుంచి ఇవి రక్షిస్తుంటాయి. చాలా బ్యాక్టీరియా, వైరస్ కారణంగా టాన్సిల్స్‌లో ఇన్‌ఫెక్షన్స్ వస్తుంది. అపరిశుద్ధ ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. లేదా, వాతావరణంలో ఏర్పడే మార్పుల కారణంగా కూడా ఇది జరుగుతుంది.
ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని కారణంగా చిన్న పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. దవడ కింది భాగంలో వాపు, చెవి కింద భాగంలో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది, బలహీనత వంటివి కూడా టాన్సిల్స్ లక్షణాలే. ఈ సమస్య ఏర్పడినట్లయితే.. డాక్టర్‌ను సంప్రదించి వెంటనే చికిత్స పొందాల్సి ఉంటుంది. అయితే, ఈ సమస్యకు చాలా వరకు ఇంటి చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తేనె..
తేనె శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వ్యాధులను నయం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. గొంతులో ఉపశమనం కోసం దీనిని రెండు విధాలుగా తీసుకోవచ్చు. పాలలో కలిపి తాగొచ్చు, గోరు వెచ్చని నీటిలో పసుపు, తేనె కలుపుకుని తాగొచ్చు.
ఉప్పుతో పుక్కిలించడం..
గొంతు, నోటి లోపల అనేక సమస్యలను తొలగించడానికి ఇది ఉత్తమ ప్రక్రియ. గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఉప్పునీటితో రోజుకు రెండు మూడు సార్లు పుక్కిలించాలి. ఇలా చేయడం ద్వారా నోటిలోని క్రిములు బయటకు వెళ్లిపోవడం, నశించడం జరుగుతుంది.
పుదీనా టీ..
పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పుదీనా టీని రోజుకు రెండు మూడు సార్లు తాగితే టాన్సిల్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.
పసుపు పాలు..
పసుపు పాలు కూడా టాన్సిల్స్‌కి దివ్యౌషధం లా పని చేస్తాయి. మరుగుతున్న పాలలో కొన్ని పసుపు కలపాలి. పడుకునే ముందు మాత్రమే పసుపు పాలు తాగాలి. ఇది టాన్సిల్స్ వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
క్యారెట్ రసం..
క్యారెట్‌లోనూ అనేక యాంటీ-టాక్సిన్‌లు ఉన్నాయి. ఇవి టాన్సిల్స్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. అంతే కాదు ఈ రసం తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also read:
Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!
వామ్మో ఇదేందిరా బాబు.. పిల్లిని దువ్విన కుందేలు.. ఎందుకు ఇంతలా కాకా పట్టిందో తెలుసా..