Health Tips: చూయింగ్‌ గమ్ నమలడం ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ బెనిఫిట్‌ కూడా ఉందండోయ్..!

|

Jul 18, 2022 | 6:27 PM

Health Tips: పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చాలా మంది చూయింగ్ గమ్ నములుతుంటారు. అయితే, పిల్లలు ఆ చూయింగ్ గమ్ తింటే..

Health Tips: చూయింగ్‌ గమ్ నమలడం ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ బెనిఫిట్‌ కూడా ఉందండోయ్..!
Chewing Gum
Follow us on

Health Tips: పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చాలా మంది చూయింగ్ గమ్ నములుతుంటారు. అయితే, పిల్లలు ఆ చూయింగ్ గమ్ తింటే పెద్దలు కోపగించుకుంటారు. చూయింగ్ గమ్ తినొద్దంటూ వార్నింగ్ కూడా ఇస్తారు. ఇంకొందరు నీరసం తగ్గించుకునేందుకు చూయింగ్ గమ్ నములుతారు. మరికొందరైతే తమ ఎదుటి వారు చూయింగ్ గమ్ నమలితే చిరాకు పడతారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. చూయింగ్ గమ్‌తో అనారోగ్యమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చూయింగ్ గమ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చూయింగ్ గమ్ నమడం వల్ల డబుల్ చిన్ సమస్య తొలగిపోతుంది.
చూయింగ్ గమ్ హిప్పోకాంపస్‌లోని మెదడులోని భాగాన్ని సక్రియం చేస్తుంది. అంటే.. జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది.
చూయింగ్ గమ్ నమలడం వలన మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
చూయింగ్ గమ్ నమలడం వల్ల ఒత్తిడిని, చిరాకును తగ్గుతుంది.
చూయింగ్ గమ్ నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. దంతాల పసుపు రంగును కూడా తొలగించగలదు.
నోటిలో లాలాజలం, క్షయం, సున్నితత్వాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..