Health Tips: హైబీపీ నుంచి మధుమేహం వరకు 7 తీవ్రమైన వ్యాధులకు చెక్ పెట్టే అద్భుతమైన వంటింటి పదార్థాం.. వివరాలివే..

|

Aug 15, 2023 | 6:23 PM

మధుమేహం, ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనంతటికీ కారణం.. సరికాని జీవనశైలి, జంక్ ఫుడ్స్ వంటివి తినడం. ఇక చాలా మంది ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. లేదంటే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇక రక్తపోటు, ఊబకాయం, అధిక బరువు సహా ఇతర అనారోగ్య సమస్యలు మనం నిత్యం వంటల్లో వినియోగించే పదార్థాలతో..

Health Tips: హైబీపీ నుంచి మధుమేహం వరకు 7 తీవ్రమైన వ్యాధులకు చెక్ పెట్టే అద్భుతమైన వంటింటి పదార్థాం.. వివరాలివే..
Health Tips
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక కర్తపోటు, మధుమేహం, ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీనంతటికీ కారణం.. సరికాని జీవనశైలి, జంక్ ఫుడ్స్ వంటివి తినడం. ఇక చాలా మంది ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. లేదంటే సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇక రక్తపోటు, ఊబకాయం, అధిక బరువు సహా ఇతర అనారోగ్య సమస్యలు మనం నిత్యం వంటల్లో వినియోగించే పదార్థాలతో తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వంటింటి పదార్థం ఏంటి? ఎలాంటి సమస్యలు తగ్గుతాయి? పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏలకులు..

భారతీయులు తమ వంటకాల్లో యాలకులు లేకుండా వంటలు చేయడం చాలా అరుదు. ఈ ఏలకులు సుగంధ ద్రవ్యాల్లో కీలకమైనది. సుగంధ ద్రవ్యాల రాణి అని ఏలకులను పిలుస్తారు. ఈ ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహకరిస్తాయి. మరి ఏలకుల వలన ఎలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. హైపర్ టెన్షన్ కంట్రోల్..

హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటును నియంత్రించడంలో పచ్చి ఏలకులు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఒక పరిశోధన ప్రకారం, 20 మంది హై బీపీ రోగులకు రోజూ ఏలకుల పొడిని తినిపించడం ద్వారా బీపీ సాధారణ స్థాయికి చేరినట్లు గుర్తించారు. ఎన్ఎస్‌బీఐ అధ్యయన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

2. పొట్ట కొవ్వును తగ్గించండి..

పచ్చి ఏలకులను తినడం ద్వారా త్వరగా బరువు తగ్గుతారు. వీటిని తినడం ద్వారా జీవక్రియ మెరుగవుతుంది. కొవ్వును తగ్గిస్తుంది. దీనిని రోజూ తినడం ద్వారా కొవ్వు త్వరగా కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు.

3. డయాబెటిస్‌‌ నియంత్రణలో..

ఏలకులను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక పరిశోధనలలో, ఏలకులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ప్రభావవంతంగా పరిగణించబడ్డాయి.

4. ఆకలిని పెంచుతాయి..

టెక్సాస్ A&M అగ్రిలైఫ్ అధ్యయనంలో ఏలకులు ఆకలిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఏలకులు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని, ఆకలి పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.

5. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..

ఏలకుల వినియోగం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, కాలేయ ఎంజైమ్‌లను తగ్గిస్తుంది. ఇది కాలేయం ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. సిర్రోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

ఏలకుల్లో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కణితి కణాలను నాశనం చేసే శక్తి ఏలకులకు ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే ఏలకులు తినడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

7. ఓరల్ హెల్త్ బెనిఫిట్స్..

నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పి, దంతాల నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఏలకులను తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి. దీని వల్ల నోటి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయని చెబుతున్నారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఇంటర్నెట్‌లో ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..