Health: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అది తగ్గించాల్సిందే.. ముప్పు తప్పదు..!

|

May 23, 2023 | 12:52 PM

నలభీముడి వంటకాలైనా ఉప్పు వేయకపోతే రుచి అస్సలు ఉండదు. అందుకే చిటికెడు ఉప్పుతో ఎలాంటి వంటకం అయినా అద్భుతహ అనిపిస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉప్పు సొంతం. అందుకే.. మనం రోజూ తినే ఆహారం ఉప్పు తప్పకుండా వేస్తాం. అయితే, ఉప్పు ఎంత రుచికరమో.. అంతకంటే ప్రమాదకరం కూడా. ఉప్పు ఎక్కువగా తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

Health: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అది తగ్గించాల్సిందే.. ముప్పు తప్పదు..!
Salt Side Effects
Follow us on

నలభీముడి వంటకాలైనా ఉప్పు వేయకపోతే రుచి అస్సలు ఉండదు. అందుకే చిటికెడు ఉప్పుతో ఎలాంటి వంటకం అయినా అద్భుతహ అనిపిస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉప్పు సొంతం. అందుకే.. మనం రోజూ తినే ఆహారం ఉప్పు తప్పకుండా వేస్తాం. అయితే, ఉప్పు ఎంత రుచికరమో.. అంతకంటే ప్రమాదకరం కూడా. ఉప్పు ఎక్కువగా తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అలాగే ఉప్పు తక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సోడియం లోపంతో కండరాల్లో నొప్పి, తిమ్మిరి, అలసట, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, చిరాకు, మతిమరుపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక అవసరం కంటే ఎక్కువగా తింటే.. ప్రాణాంతకమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే.. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. తలనొప్పి: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ తలనొప్పి తేలికపాటి నుంచి తీవ్రంగా ఉంటుంది. ఆహారం తిన్న 1-2 గంటల సమయంలో మీకు తలనొప్పిగా అనిపిస్తే.. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో సోడియం స్థాయి పెరిగిందని అర్థం.

2. చేతులు, కాళ్ళలో వాపు, తిమ్మిర్లు: సోడియం స్థాయిలు పెరగడం వల్ల చేతులు, పాదాల వేళ్లు, చీలమండలలో వాపు సంభవించవచ్చు. దీనిని ఎడెమా అని కూడా పిలుస్తారు. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా దూర ప్రయాణాల్లో వాపు సమస్య పెరుగుతుంది. నిరంతరం ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

3. అధిక రక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారం తిన్న 30 నిమిషాలలోపు లేదా తర్వాత శరీరంలో సమస్య అనిపిస్తే, అది రక్తపోటు లేదా రక్తనాళాలపై ప్రభావం చూపిందని అర్థం చేసుకోవాలి. అధిక రక్తపోటుకు చికిత్స తీసుకోకుండా వదిలేస్తే సమస్య మరింత పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదానికి దారి తీస్తుంది. చూపు మందగించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే రక్తపోటు పెరిగిందని అర్థం.

4. తరచుగా మూత్రవిసర్జన: ఎక్కువ ఉప్పు పదార్థాలు తినడం వల్ల దాహం పెరుగుతుంది. దాహం తీర్చుకోవడానికి అధికంగా నీరు త్రాగాల్సి వస్తుంది. దీని కారణంగా తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..