Health Tips: పెరుగు(Curd), చక్కెర తినడం ఆరోగ్యాని(Health)కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పంచదార కలిపిన పెరుగు తింటే.. అది శరీరానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి, మనస్సుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. రోజూ పెరుగు తినడం వల్ల పొట్ట సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. కొంతమందికి పాలు ఇష్టం ఉండదు. వారు పాలకు ప్రత్యామ్నాయంగా పెరుగు తినవచ్చు.
పెరుగులో పోషకాలు- క్యాల్షియం, విటమిన్ బి-12, విటమిన్ బి-2, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పెరుగులో ఉంటాయి. మరోవైపు, మీరు చక్కెరతో పెరుగు తింటే, దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో పెరుగు, పంచదార తింటే పొట్ట బాగా ఉంటుంది. పెరుగు, చక్కెర తినడం ద్వారా, శరీరానికి మంచి మొత్తంలో గ్లూకోజ్ లభిస్తుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
పెరుగు, చక్కెర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
1- మంచి బ్యాక్టీరియా లభిస్తుంది- పొట్టకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఈ బ్యాక్టీరియా పేగులకు కూడా మేలు చేస్తుంది. పెరుగు, పంచదార తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా పెద్దప్ పేగు క్యాన్సర్ నుంచి కూడా రక్షిస్తుంది.
2- సులభంగా జీర్ణమవుతుంది- పెరుగు కూడా సులభంగా జీర్ణమవుతుంది. పాల కంటే పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది. పెరుగు లేదా దాని నుంచి తయారైన ఉత్పత్తులు అల్పాహారంలో త్వరగా జీర్ణమవుతాయి. పెరుగు మీ కడుపుని తేలికగా ఉంచుతుంది. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పెరుగు లేదా మజ్జిగ తాగాలి.
3- కడుపులో చల్లదనం ఉంటుంది- ఉదయాన్నే పెరుగు, పంచదార తింటే పొట్ట చల్లగా ఉంటుంది. ఇది కడుపులో చికాకు, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.
4- UTI, టాయిలెట్‌లో మంట తగ్గుతుంది- పెరుగు చక్కెర తినడం వల్ల UTI, సిస్టిటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. పెరుగు తినడం వల్ల టాయిలెట్‌లో మంట సమస్య కూడా తగ్గుతుంది. తక్కువ నీరు తాగే వారు పెరుగు తప్పనిసరిగా తినాలి. విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ పిరిడాక్సిన్, కెరోటినాయిడ్స్, ఫోలేట్, విటమిన్ బి-2, విటమిన్ బి-12 వంటి విటమిన్లు పెరుగులో ఉంటాయి.
5- గ్లూకోజ్ అందుబాటులో ఉంది- ఉదయాన్నే పెరుగు చక్కెర తినడం వల్ల, శరీరానికి వెంటనే గ్లూకోజ్ అందుతుంది. పెరుగు, చక్కెర తినడం ద్వారా, మీరు రోజంతా చురుకుగా ఉంటారు. గ్లూకోజ్ మీ మనస్సు, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకే పెరుగు తిని ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.
Also Read: Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్త.. తల్లికి ఈ వ్యాధి ఉంటే బిడ్డకి ఇన్ఫెక్షన్..?
Tippa Teega: తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్నో ఉపయోగాలు