Health Tips: జలుబు, దగ్గు సమస్యకు పదే పదే మెడిసిన్స్ వాడుతున్నారా? జాగ్రత్త.. ఈ సమస్య రావొచ్చు.. !

|

Aug 08, 2023 | 11:41 AM

ఇటీవలి కాలంలో డెంగ్యూ, ఐ ఫ్లూ, టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వీటితో పాటే వైరల్ ఫీవర్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరల్ జ్వరం ఉన్న రోగులలో ప్రారంభ లక్షణాలు జలుబు, దగ్గు ఉంటుంది. అయితే, జబ్బుల నుంచి ఉపశమనం పొందడానికి..

Health Tips: జలుబు, దగ్గు సమస్యకు పదే పదే మెడిసిన్స్ వాడుతున్నారా? జాగ్రత్త.. ఈ సమస్య రావొచ్చు.. !
Health Issues
Follow us on

నిరంతర వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల అనేక రకాల బ్యాక్టీరియాల వ్యాప్తి పెరుగుతుంది. వీటి కారణంగా, ప్రజలు వివిధ రకాల వ్యాధులకు గురవుతారు. ఇటీవలి కాలంలో డెంగ్యూ, ఐ ఫ్లూ, టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వీటితో పాటే వైరల్ ఫీవర్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరల్ జ్వరం ఉన్న రోగులలో ప్రారంభ లక్షణాలు జలుబు, దగ్గు ఉంటుంది. అయితే, జబ్బుల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది సొంతంగా మందులు తీసుకుంటుంటారు. కానీ, ఇది వారికి మరింత చేటును చేస్తుంది. జబులు, దగ్గు కోసం సొంతంగా మెడిసిన్స్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి తగ్గకపోగా.. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి జలుబు, దగ్గు, ఇతర సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది మొదట యాంటీబయాటిక్ ఔషధాలను వేసుకుంటారు. కారణం బ్యాక్టీరియా వ్యాప్తి నియంత్రిస్తుంది. సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే, జలుబు, దగ్గు అనేది బ్యాక్టీరియా వ్యాప్తి కాదు. వైరల్ ఇన్‌ఫెక్షన్ మాత్రమే. ఇది కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉంటే.. ఒకటి రెండు రోజుల్లో సమస్య తగ్గిపోతుంది. అలా కాకుండా ఈలోగానే వ్యక్తి యాంటీబయోటిక్స్ మెడిసిన్స్ తీసుకుంటే.. అది వారి శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. దాంతో కొత్త సమస్యలు తలెత్తుతాయి.

అనవసరంగా మందులు తీసుకోవద్దు..

స్వల్పంగా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మందులు వేసుకునేవారు చాలా మంది ఉన్నారు. వైద్యులను సంప్రదించకుండానే, ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి అవసరమైన మెడిసిన్స్ వేసుకుంటారు. అయితే, ఇది వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే సొంతంగా మెడిసిన్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండా అతిగా మెడిసిన్స్, యాంటీబయోటిక్స్ వాడటం వలన శరీరంలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ప్రభావం ఉంటుందని, అలాంటి పరిస్థితిలో ఔషధాలు తీసుకున్నా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. శరీరంలోని వ్యాధికారక బ్యాక్టీరియా ఈ మందులకు అలవాటు పడటం వలన.. ఆ మందులకు వ్యతిరేకంగా తమను తాము సిద్ధం చేసుకుంటాయి. తద్వారా యాంటీబయోటిక్స్ వాడినా పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కారణంగానే మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కారణంగానే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో 2019 సంవత్సరంలో 7 లక్షల మరణాలు బ్యాక్టీరియా వ్యాప్తి వల్లే జరిగింది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు యాంటీబయాటిక్స్ తీసుకుంటారని, గత కొన్నేళ్లుగా యాంటీబయోటిక్స్ వాడకం బాగా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..