Health Tips: వేసవిలో పెరుగును ఎక్కువగా తీసుకుంటారు. కారణం శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పెరుగును అనేక విధాలుగా తీసుకోవచ్చు. పరాటాలు, లస్సీ రూపంలో, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. పెరుగును రైతా, పెరుగు అన్నం, దహీ రూపంలో కూడా తినవచ్చు. పెరుగు వంటకం రుచిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పెరుగులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగును తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాల్సిందే. అయితే, కొన్ని ఆహారాలతో పాటు దీనిని తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది పుడ్ పాయిజన్ అయి.. అనారోగ్యానికి కారణం అవుతుంది. మకి పెరుగుతో తినకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉల్లిపాయ, పెరుగు..
చాలా మంది పెరుగు, ఉల్లిపాయ రైతా తింటారు. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల ఎగ్జిమా, సొరియాసిస్, స్కిన్ అలర్జీలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
చేప, పెరుగు..
పెరుగుతో చేపలను తినడం మానుకోండి. ఈ రెండింటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండు ప్రోటీన్లు అధికంగా ఉండే వాటిని కలిపి తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి, ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.
పాలు, పెరుగు..
పాలను ఉపయోగించే పెరుగును తయారు చేస్తారు. కానీ ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. దీని వల్ల విరేచనాలు, అసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉరద్ పప్పు, పెరుగు
ఒక నివేదిక ప్రకారం.. పెరుగును ఉరద్ పప్పుతో కలిపి తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పాడవుతుంది. అజీర్ణం, అతిసారం, ఉబ్బరం సమస్య వస్తుంది.
పెరుగును నూనె పదార్థాలతో కలిపి తీసుకోవద్దు..
చాలా మంది పెరుగును నెయ్యి, ఇతర నూనె పదార్థాలతో కలిపి తింటారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. పెరుగుతో నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది.