Uric Acid Issues: చాలా మంది ప్రజలు యూరిక్ యాసిడ్ సమస్యతో సతమతం అవుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండుద్రాక్ష: ఎండుద్రాక్ష వినియోగం చాలా మంచిదని భావిస్తారు. ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ఎండు ద్రాక్ష తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
పెరుగు: శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే.. ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. పెరుగులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ సమస్యను మరింతగా పెంచుతుంది. అందుకే పెరుగును వీరు తినకూడదని చెబుతున్నారు.
కాయధాన్యాలు, బియ్యం: పప్పుల్లోనూ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. అందుకే పప్పులను అస్సలు తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు.
క్యాబేజీ: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని క్యాబేజీ పెంచుతుంది. ఇందులో ఉండే ప్యూరిన్‌లు యూరిక్ యాసిడ్‌ను మరింత పెంచగలవని చెబుతున్నారు. అందుకే క్యాబేజీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఫ్రై చేసిన ఆహారాలు: ఫ్రై చేసిన ఆహార పదార్థాలు ఏవిధంగా చూసినా హానీకరమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే అనేక సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
నిమ్మకాయ: నిమ్మకాయ శరీరానికి ప్రయోజనకరంగా పేర్కొంటారు. అయితే, దీనిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న సమయంలో నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రం అవుతుంది.
Also read:
Raashi Khanna: అలాంటి స్ర్కిప్ట్‌లకు దూరంగా ఉంటున్నా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాశీఖన్నా..
RRR: పాన్ ఇండియా చిత్రాలకు ఆయనే కారణం.. ఆర్‌ఆర్‌ఆర్ ప్రెస్‌మీట్‌లో ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు..
Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!