Health Tips: ఆ సమస్య ఉన్నవారు ఈ 7 ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి.. ఉపశమనం పొందండి..

|

Mar 08, 2022 | 10:31 AM

శారీరిక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలు రావొచ్చు. ఏదొక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది.

Health Tips: ఆ సమస్య ఉన్నవారు ఈ 7 ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి.. ఉపశమనం పొందండి..
Bloating
Follow us on

శారీరిక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలు రావొచ్చు. ఏదొక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కడుపు ఉబ్బరం తగ్గిపోతుందిలే అని చాలామంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీయొచ్చు. కడుపు నొప్పి, తిమ్మిరి లాంటి సమస్యలు ప్రారంభమవుతాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో ఉబ్బరం సమస్య తరచుగా ఉంటుంది. ఈ సమస్యను నివారించాలంటే, మీరు డైట్‌లో ఈ ఆహారాలను చేర్చండి. ఇవి కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

పెరుగు:

పెరుగులో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తాయి. మీరు పండ్లతో లేదా భోజనం తర్వాత పెరుగును తీసుకోండి.. ఉబ్బరం సమస్యకు చెక్ పెట్టండి.

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అవి ఉబ్బరం, గ్యాస్‌ను నివారించడంలో సహాయపడతాయి. అల్లంలో జింగిబాన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది పేగుల్లో మంట పుట్టకుండా చూసుకుంటుంది.

ఫెన్నెల్ సీడ్స్:

సోంపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సోపు గింజలు పేగు కండరాలకు రిలాక్స్ చేస్తాయి. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి. అందువల్ల మీరు సోపు గింజలను క్రమం తప్పకుండా తినడం మంచిది.

అరటిపండు:

కడుపు ఉబ్బరానికి ప్రధాన కారణాలలో ఒకటి పొటాషియం లేకపోవడం. పొటాషియం సమృద్ధిగా అరటిపండులో దొరుకుతుంది. భోజనం తర్వాత అరటిపండు తింటే.. కడుపు ఉబ్బరం నుంచి రిలీఫ్ పొందొచ్చు.

నిమ్మకాయ:

ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో నిమ్మకాయ బెస్ట్ ఆప్షన్. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

అవకాడో:

మీరు తక్కువ కార్బ్ ఆహారంలో ఉన్నట్లయితే, ఉబ్బరం తగ్గించడానికి అవకాడో ఉత్తమ ఎంపిక. పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల, అవకాడో తింటే.. మీకు ఎక్కువసేపు ఆకలి వేయదు.

దోసకాయ:

దోసకాయలో అధిక నీటిశాతం ఉండటం వల్ల మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

అలాగే యోగర్ట్, బ్లాక్ బెర్రీస్, గ్రీన్ టీ, సెలెరి, బొప్పాయి, ఓట్స్, అనాస పండు, పసుపు, ఆపిల్ పండ్లు, కివి, పెప్పర్‌మెంట్ టీ లాంటివి కూడా కడుపు ఉబ్బారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Also Read:

Akhil Akkineni : బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌తో అక్కినేని ప్రిన్స్ భారీ మూవీ ప్లాన్..