Ghee Benefits: ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే ఏమౌతుందో తెలుసా?

|

Oct 27, 2022 | 6:09 PM

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిపుణులు దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. రోజువారీ ఆహారంలో నెయ్యి ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే..

Ghee Benefits: ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే ఏమౌతుందో తెలుసా?
Ghee
Follow us on

చలికాలమైనా, వేసవికాలమైనా చాలామంది నెయ్యి తినడానికి ఇష్టపడతారు. వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది వింటుంటే..మీ నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి కదా..! అయితే, బరువు పెరుగుతారనే భయంతో ఇంకొంతమంది నెయ్యిని దూరం పెడుతుంటారు. నెయ్యి తింటే బరువు అస్సలు పెరిగే ఛాన్స్‌ లేదని నిపుణులు చెబుతున్నారు. బదులుగా నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కేవలం రుచి, వాసన కోసం ప్రపంచవ్యాప్తంగా నెయ్యికి డిమాండ్ అంత ఎక్కువగా ఉండదు. కానీ, నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిపుణులు దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. రోజువారీ ఆహారంలో నెయ్యి ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే ఏమౌతుందో తెలుసా? అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం,.. నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే చాలా మేలు జరుగుతుంది. ఖాళీ కడుపుతో రోజూ ఒక చెంచా నెయ్యి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో పాటు మలబద్ధకం సమస్య ఉన్నవారికి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తినడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే నిద్ర సమస్యలు లేదా నిద్రలేమి సమస్య తీరుతుందని అంటున్నారు. దానితో పాటు ఒత్తిడి, డిప్రెషన్, రకరకాల మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.

నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ముఖంపై ఏర్పడే ముడతలను నివారిస్తుంది. రూపాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. నెయ్యితో బరువు పెరుగుతారనేది అపోహ..బదులుగా, నెయ్యి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మం మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. కడుపు సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. నెయ్యి శరీరంలో శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి