Health Problems: మీరు రాత్రి పూట సమయ వేళలు పాటించకుండా భోజనం చేస్తున్నారా..? ప్రమాదమే..!

|

Dec 22, 2021 | 1:44 PM

Health Problems: ఇప్పుడున్న కాలంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నారు. ఎందుకంటే జీవనశైలిలో..

Health Problems: మీరు రాత్రి పూట సమయ వేళలు పాటించకుండా భోజనం చేస్తున్నారా..? ప్రమాదమే..!
Follow us on

Health Problems: ఇప్పుడున్న కాలంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నారు. ఎందుకంటే జీవనశైలిలో మార్పు, టెన్షన్‌, ఇతర కారణాల వల్ల మానవుడు వ్యాధుల బారిన పడుతున్నాడు. సమయానికి తినకపోవడం కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. సమయ వేళలు పాటించకుండా ఆహారం తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అర్ధరాత్రి సమయంగానీ, సమయానికి మించి భోజనం చేయడం గానీ చేస్తుంటే షుగర్‌ వ్యాధులతో పాటు గుండె జబ్బులు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉందంటున్నారు.
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల గుండె సమస్యలతో పాటు మెదడుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పరిశోధకులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలలో స్పష్టమైంది.

ఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అని పెద్దలు అంటుంటారు. వేళాపాల లేకుండా ఆహారం తింటే అనారోగ్యం బారిన పడతారనే ఉద్దేశంతో పెద్దలు చెబుతుంటారు. నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. తదేకంగా టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలీకుండా బాగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే పరిశోధనల్లో తేలింది. దీని వల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్‌నైట్‌ జంక్‌ఫుడ్‌ తినే వారిని జాగ్రత్తగా పరిశీలించారు. వారి వివరాలను పొందుపరిచారు. పడుకునే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైందని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది. సో.. అర్ధరాత్రి సమయంలో ఆహారం, స్నాక్స్‌ తీసుకోకపోవడం మంచిదంటున్నారు. అలాగే రాత్రుల్లో ఆలస్యంగా భోజనం చేసినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు జ్ఞాపకశక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. రాత్రి సమయాల్లో కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

High Blood Pressure: చలికాలం అధిక రక్తపోటుతో చాలా ఇబ్బంది.. మీకు హై బీపీ ఉందా? అయితే..ఈ జాగ్రత్తలు పాటించండి!

Health Problems: నిద్రలేమి సమస్యతో ఎన్నో అనర్థాలు.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..!