Health News: ఈ సమయాలలో కచ్చితంగా నీరు తాగండి.. లేదంటే ఆరోగ్యానికి పెద్ద ఎదురుదెబ్బ..!

|

Mar 18, 2022 | 5:58 AM

Health News: బతకాలంటే ప్రతి ఒక్కరు నీరు తాగాల్సిందే. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నీటి అవసరం అధికంగా ఉంటుంది. నీరు మన దాహాన్ని తీర్చుతుంది. శరీరం డీ

Health News: ఈ సమయాలలో కచ్చితంగా నీరు తాగండి.. లేదంటే ఆరోగ్యానికి పెద్ద ఎదురుదెబ్బ..!
Drink Water
Follow us on

Health News: బతకాలంటే ప్రతి ఒక్కరు నీరు తాగాల్సిందే. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నీటి అవసరం అధికంగా ఉంటుంది. నీరు మన దాహాన్ని తీర్చుతుంది. శరీరం డీ హైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది. అనవసరమైన ట్యాక్సిన్స్‌ని బయటికి పంపిస్తుంది. అందుకే నిపుణులు ప్రతిరోజూ తగినంత మొత్తంలో నీటిని తాగాలని సూచిస్తారు. కానీ ఎక్కువగా నీరు తాగడం వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. సాధారణం కంటే ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. అదనపు నీటిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలు ఓవర్ టైమ్ పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండెపై అధిక భారం పడుతుంది. కడుపులో చికాకు మొదలవుతుంది. వాస్తవానికి మనం ఒక రోజులో ఎంత నీరు త్రాగాలి.. దీనికి సమాధానం వయస్సు, లింగం, శరీర బరువు, పని, జీవక్రియని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ రోజులో కొన్ని సమయాలలో కచ్చితంగా నీరు తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి సమయాలు ఏంటో తెలుసుకుందాం.

1. మేల్కొన్న తర్వాత: ఉదయాన్నే మేల్కొన్న తర్వాత కచ్చితంగా నీరు తాగాలి. ఇది అంతర్గత అవయవాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

2. వ్యాయామం తర్వాత: వ్యాయామం తర్వాత నీరు తాగితే హృదయ స్పందన రేటును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది.

3. భోజనానికి ముందు: భోజనానికి అరగంట ముందు తగినంత నీరు తాగాలి.

4. అనారోగ్యంగా అనిపించడం: మీకు అనారోగ్యంగా అనిపించినప్పుడల్లా శరీరాన్ని హైడ్రేట్ చేయండి. ఇది శరీరం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

5. అలసిపోయిన అనుభూతి: అలసిపోయినప్పుడు నీరు తాగాలి. అప్పుడు శరీరం రీఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది.

6. ప్రతిరోజు నీరు తాగండి.. మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోండి. కానీ ఈ సమయాలలో నీరుతాగడం మాత్రం మరిచిపోకండి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!

Holi 2022: సేంద్రియ రంగులతో హోలీ ఆడండి.. పర్యావరణాన్ని కాపాడండి..

Hyderabad: జూబ్లీహిల్స్‌ రోడ్డులో కారు బీభత్సం.. రెండున్నరేళ్ల బాబు అక్కడికక్కడే మృతి