Peanuts: వేరుశెనగలని చాలామంది ఎంతో ఇష్టపడి తింటారు. రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొంతమందికి మాత్రం వేరుశెనగ అంటే ఎలర్జీ. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటారు. అయితే తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లలకి వేరుశెనగ పెడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజులకి వారు ఎలర్జీ నుంచి బయటపడుతారని చెబుతున్నారు. వేరుశెనగ ప్రోటీన్‌తో కూడిన చౌకైన గొప్ప అల్పాహారం. కానీ కొంతమంది దీనిని తినడం వల్ల అలెర్జీ బారిన పడుతారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య వేధిస్తోంది.
ఒక ఆరోగ్య సంస్థ 3 సంవత్సరాల వయసు ఉన్న 146 మంది పిల్లలపై ఒక పరిశోధన నిర్వహించింది. ఇందులో చిన్నారులకు ప్రతిరోజూ వేరుశెనగ అందించారు. మొదటగా అందరు ఎలర్జీ బారినపడ్డారు. తర్వాత కొన్ని రోజులు వేరుశెనగ ఇవ్వడం ఆపేసారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. కానీ ఈ సారి కొంతమంది మాత్రమే ఎలర్జీ బారినపడ్డారు. దీంతో పరిశోధన నిర్వాహకులు చిన్నప్పటి నుంచి వేరుశెనగ గింజలని కొద్ది కొద్దిగా తింటూ ఉంటే ఎలర్జీ బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.
పాశ్చాత్య దేశాలలో వేరుశెనగ అలెర్జీలు రెండు శాతం మంది పిల్లలను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వీరు వేరుశెనగ గింజలని తినకూడదు. ఒక పిల్లవాడు ఎలర్జీకి గురైనప్పుడు అతడి పక్కన ఉన్న పిల్లలకి కూడా ఎలర్జీ సోకే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ అలెర్జీకి ప్రస్తుతం చికిత్స లేదు. ఇది పిల్లలలో ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. కానీ చిన్నప్పటి నుంచి వేరుశెనగ గింజలని కొంచెం కొంచెం తింటుంటే దీని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.