Women’s Day 2022: ఉబ్బరం అనేది ఒక సాధారణ సమస్య. ఇది తరచుగా మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యల కారణమవుతుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. కానీ చాలామంది మహిళలు ఈ సమస్యను విస్మరిస్తారు. ఇది తరువాత తీవ్రమైన వ్యాధులకి కారణమవుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, తిమ్మిరి సమస్య ప్రారంభమవుతుంది. పీరియడ్స్ సమయంలో ఉబ్బరం సమస్య తరచుగా ఉంటుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ఆహారంలో సూపర్ ఫుడ్స్‌ని చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందులో ముఖ్యమైనది పెరుగు. ఇందులో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తాయి. మీరు సాధారణ పెరుగును భోజనం తర్వాత తీసుకోవచ్చు. అలాగే అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఉబ్బరం, గ్యాస్‌ను నివారించడంలో సహాయపడతాయి. అల్లంలో జింగిబాన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది పేగులను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
సోంపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సోపు గింజలు పేగు కండరాలకు విశ్రాంతినిస్తాయి. గ్యాస్ బయటకు రావడానికి సహాయం చేస్తాయి. ఉబ్బరాన్ని నివారించడానికి ఇవి పనిచేస్తాయి. అందువల్ల, మీరు సోంపుని క్రమం తప్పకుండా తింటే మంచిది. ఉబ్బరానికి ప్రధాన కారణాలలో ఒకటి పొటాషియం లేకపోవడం. అందువల్ల పొటాషియం సమృద్ధిగా ఉండే అరటిపండు తింటే చాలా మంచిది. ఉబ్బరాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ రసాన్ని సేవించవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.