Late Night Eating: అర్ధరాత్రి సమయంలో తింటే గుండె, మెదుడుకు ముప్పు.. తాజా పరిశోధనలలో వెల్లడి

Late Night Eating: ప్రస్తుతమున్న జనరేషన్‌లో అనారోగ్య సమస్యలు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే ఉద్యోగంలో ఒత్తిడి, మానసిక ఒత్తిళ్లు, సమయానికి ఆహారం..

Late Night Eating: అర్ధరాత్రి సమయంలో తింటే గుండె, మెదుడుకు ముప్పు.. తాజా పరిశోధనలలో వెల్లడి

Updated on: Jun 05, 2021 | 9:37 PM

Late Night Eating: ప్రస్తుతమున్న జనరేషన్‌లో అనారోగ్య సమస్యలు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే ఉద్యోగంలో ఒత్తిడి, మానసిక ఒత్తిళ్లు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో తినడం వంటివి చేస్తుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాగే నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగడంతో పాటు కొవ్వు పదార్థాలు పెరిగి గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది.

ఎవరైనా అర్ధరాత్రి తిండి తింటుంటే ‘దెయ్యం తిండి తినటం మంచిది కాదు’ అని పెద్దలు అంటుంటారు. వేళాపాల లేకుండా ఆహారం తింటే అనారోగ్యం బారిన పడతారనే ఉద్దేశంతో పెద్దలు చెబుతుంటారు. నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. తదేకంగా టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలీకుండా బాగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే పరిశోధనల్లో తేలింది. దీని వల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్‌నైట్‌ జంక్‌ఫుడ్‌ తినే వారిని జాగ్రత్తగా పరిశీలించారు. వారి వివరాలను పొందుపరిచారు. పడుకునే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్‌ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైందని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది. సో.. అర్ధరాత్రి సమయంలో ఆహారం, స్నాక్స్‌ తీసుకోకపోవడం మంచిదంటున్నారు. అలాగే రాత్రుల్లో ఆలస్యంగా భోజనం చేసినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు జ్ఞాపకశక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. రాత్రి సమయాల్లో కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది.

ఇవీ కూాడా చదవండి:

Weight Loss: రాత్రి 8 గంటల తర్వాత తింటే బరువు పెరుగుతారా ? అధ్యాయనాల్లో షాకింగ్ నిజాలు..

SkinCare Tips: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‏ను తొలగించే దివ్య ఔషదం జామ ఆకు..