Health: అదే పనిగా కూర్చుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు ఆహ్వానం పలికినట్లే

|

Jul 02, 2022 | 5:49 PM

ఏదైనా అనారోగ్య సమస్య (Health Problems) తలెత్తితే డాక్టర్లు వ్యాయామం చేయాలని సూచిస్తారు. వైద్యుల సలహాతో కొద్ది రోజులు బాగానే ఎక్సర్సైజ్ చేస్తాం. ఇలా కొద్ది రోజులు చేయగానే నిస్సత్తువ ముంచుకొస్తుంది. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాం కదా. ఇవాళ...

Health: అదే పనిగా కూర్చుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు ఆహ్వానం పలికినట్లే
Health Problems With Sittin
Follow us on

ఏదైనా అనారోగ్య సమస్య (Health Problems) తలెత్తితే డాక్టర్లు వ్యాయామం చేయాలని సూచిస్తారు. వైద్యుల సలహాతో కొద్ది రోజులు బాగానే ఎక్సర్సైజ్ చేస్తాం. ఇలా కొద్ది రోజులు చేయగానే నిస్సత్తువ ముంచుకొస్తుంది. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాం కదా. ఇవాళ చేయకపోయినా పర్వాలేదు. రేపు చేద్దాంలే అనుకుంటూ వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. రేపు, మాపు అనుకుంటూ రోజులు గడిపేయడమే తప్పా.. ఎలాంటి పురోగతి లేకుండా పోతుందని ఆరోగ్య నిపుణలు (Experts) చెబుతున్నారు. అప్పుడప్పుడు వ్యాయామం ఆపేసినా ఎలాంటి ఇబ్బందీ ఉండదని కొందరు భావిస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని, స్వల్పకాలంలో బాగానే ఉన్నా.. దీర్ఘకాలంలో పెను సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు. కేవలం రెండు వారాల పాటు వ్యాయామం మానేసినా కండరాల మోతాదు తగ్గుతోందని, కొవ్వు శాతం పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎక్కువవుతున్నాయని అంటున్నారు. తక్కువ సమయంలోనే ఇలాంటి ప్రభావం కనబడటం ఆందోళన కలిగిస్తోందంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్.

ఎక్సర్సైజ్ చేసేందుకు రోజూ ఒకే సమయాన్ని ఎంచుకోవాలి. ఆ టైమ్ టేబుల్ ప్రకారం వ్యాయామం చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేందుకు తగినంత సమయం దొరకకపోతే ఇంట్లో, ఆఫీసుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 5000 అడుగులు, సెలవు దినాల్లో 10,000 అడుగులు నడిచేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చొని పనులు చేసేవారు వీలైనప్పుడల్లా కుర్చీలోంచి లేచి మూడు, నాలుగు నిమిషాల సేపు అటూఇటూ నడవడం ద్వారా లాభం ఉంటుంది. అవసరమైతే తేలికగా కుర్చీలో కూర్చొని చేసే యోగా పద్ధతులనూ పాటించాలంటున్నారు. ఇలా మనసుంటే మార్గం దొరక్కపోదు. బద్ధకాన్ని వీడి కాళ్లకు పనిచెప్పగలిగితే శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించాలనుకుంటే నిపుణుల సూచనలు పాటించడం మంచిది.

ఇవి కూడా చదవండి

 మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..