Health Care: ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నారా.. అయితే ఈ వర్కౌట్స్ తప్పకుండా చేయాల్సిందే!

| Edited By: Ravi Kiran

Nov 11, 2023 | 9:59 PM

ప్రస్తుతం ఇప్పుడున్న ఆధునిక యుగంతో ప్రతి ఒక్కరూ పరిగెత్తాల్సి వస్తోంది. అందుకు తగ్గట్టే మార్పులు కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్స్, ల్యాప్ ట్యాప్స్ తోనే పని. ఎంత లేదన్నా 8 నుంచి 10 గంటలు కూర్చుని పని చేయాల్సి వస్తుంది. దీంతో మెడ, వెన్ను, చేతులు, కాళ్లు, కళ్లు నొప్పులతో పాటు ఊబ కాయం కూడా వస్తుంది. అలా వచ్చినా తప్పదు.. ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు బీజీ లైఫ్ లో ఇవన్నీ కామన్ అయిపోయాయి. అలా సిస్టమ్స్ మీద వర్క్..

Health Care: ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నారా.. అయితే ఈ వర్కౌట్స్ తప్పకుండా చేయాల్సిందే!
workout
Follow us on

ప్రస్తుతం ఇప్పుడున్న ఆధునిక యుగంతో ప్రతి ఒక్కరూ పరిగెత్తాల్సి వస్తోంది. అందుకు తగ్గట్టే మార్పులు కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కంప్యూటర్స్, ల్యాప్ ట్యాప్స్ తోనే పని. ఎంత లేదన్నా 8 నుంచి 10 గంటలు కూర్చుని పని చేయాల్సి వస్తుంది. దీంతో మెడ, వెన్ను, చేతులు, కాళ్లు, కళ్లు నొప్పులతో పాటు ఊబ కాయం కూడా వస్తుంది. అలా వచ్చినా తప్పదు.. ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు బీజీ లైఫ్ లో ఇవన్నీ కామన్ అయిపోయాయి. అలా సిస్టమ్స్ మీద వర్క్ చేసేవారు.. ఖచ్చితంగా ఈ వర్క్ అవుట్స్ చేయాలి. రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఆ వర్క్ అవుట్స్ ఏంటి? ఎలా చేయాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

క్వాడ్ స్ట్రెచ్:

గంటలు గంటలు కూర్చోని పని చేయడం వల్ల తొడ భాగాల్లో కొవ్వు అనేది బాగా పేరుకు పోతుంది. అదే విధంగా మోకాళ్లు కూడా బాగా నొప్పిగా వస్తాయి. ఇలాంటి వారికి ఈ వర్క్ అవుట్ బాగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ స్ట్రెచ్ ఎలా చేయాలంటే..

మీ పాదాలను ఒకే దగ్గర పెట్టి నిలబడాలి. ఇప్పుడు మీ ఎడమ లేదా కుడి కాలుని వెనక్కి వంచి కుడి కాలు అయితే కుడి చేతితో, ఎడమ కాలు అయితే ఎడమ చేతితో పాదాన్ని పట్టుకోవాలి. ఆ తర్వాత చేతితో కాలుని చాచాలి. ఇలా ఒక కాలిపై రెండు నిమిషాలు ఉంచి.. నెక్ట్స్ మరో కాలితో చేయాలి.

సైడ్ స్ట్రెచింగ్:

ఒకే దగ్గర గంటలకు గంటలు కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. దీంతో నడుము, ఉదర భాగాల్లో కొవ్వు అనేది బాగా పేరుకు పోతుంది. అదే విధంగా వెన్ను నొప్పులు కూడా ఉంటాయి. వీటిని నుంచి ఇన్ స్టెంట్ రిలీఫ్ కావాలంటే ఈ స్ట్రెచ్ బెస్ట్.

మరి ఈ సైడ్ స్ట్రెచ్ ఎలా చేయాలంటే..

ఈ స్ట్రెచ్ ని మీరు కూర్చునే ప్రదేశంలో కూడా వేయవచ్చు. ముందుగా నార్మల్ గా కూర్చుని.. రెండు చేతులనూ పైకి లేపాలి. ఇప్పుడు ఒక వైపు వీలైనంతగా వంగి.. శరీరాన్ని సాగదీయాలి. ఆ తర్వాత మళ్లీ మరోవైపు ఇలా చేయాలి.

స్ట్రెచ్ క్యాట్ పోజ్:

ఇది వేయడం కూడా చాలా సింపుల్. ఈ క్యాట్ పోజ్ వేయడం వల్ల వెన్ను, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతే కాకుండా నడుము సైడ్స్ లో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. కండరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఈ స్ట్రెచ్ ఎలా చేయాలంటే..

ముందుగా నేలపై వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత చేతులని నిటారుగా, మోకాళ్లని వంచి నేలపై నిలబడాలి. మీ బ్యాక్ ని పైకి లేపి తలని క్రిందికి వంచాలి. ఇప్పుడు చేతులను క్రిందకి చాచండి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.