Health Benefits: రైస్ తినాలా? చపాతీ తినాలా?.. రాత్రి పడుకునే ముందు ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారంటే..

|

Jun 11, 2021 | 8:11 AM

Health Benefits: మనం ప్రతిరోజూ తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకని మనం తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం.

Health Benefits: రైస్ తినాలా? చపాతీ తినాలా?.. రాత్రి పడుకునే ముందు ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారంటే..
Health Benefits
Follow us on

Health Benefits: మనం ప్రతిరోజూ తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకని మనం తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ఇక భారతీయ ఆహారంలో రైస్, చపాతీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు రైస్, చపాతీని మాత్రమే తమ ఆహారంలో తీసుకుంటారు. ఇక దేశంలోని, ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలలో ఎక్కువగా రోటీ, చపాతీలను ఆహారంగా తీసుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో రైస్‌ను ఆహారంగా తీసుకుంటారు. అయితే, ఒక రోజులో మూడు పూటలు భోజనం చేస్తే.. అందులో ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు భోజనం సమయంలో ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోటీ, చపాతీలతో పోలిస్తే.. బియ్యంలో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంటుంది. జీర్ణం కూడా సులభంగా అవుతుంది. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో అన్నీ పాలీష్‌డ్ బియ్యం లభిస్తున్నాయి. వీటిలో విటమిన్లు చాలా తక్కువగా ఉంటాయి.

చపాతీ, రోటీ..
వీటిలో ఫైబర్, ప్రాథినియెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిని తినడం ద్వారా మళ్లీ త్వరగా ఆకలి వేయదు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, సోడియం అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు.. రాత్రి సమయంలో భోజనంలో చపాతీని చేర్చుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండింటిలో ఏది తినాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నైట్ టైమ్‌లో రైస్ బదులు చపాతీ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. డిన్నర్‌లో పప్పు, కూరగాయలు, పెరుగు, చపాతీ ఉత్తమం. అయితే, మీకు రాత్రి రైస్ తినడమే అలవాటు అయితే.. కిచిడి తినడం ఉత్తమం. రైస్‌లో పప్పు ధాన్యాలు అధికంగా వేసుకుని తినడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.

Also read:

Pushpa Movie: ‘పుష్ప’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్… బన్నీ కోసం రంగంలోకి చిరు.. ఒకే ఫ్రేమ్‏లో అలా..