Health Benefits of Walnuts: మనలో చాలా మంది ప్రజలు అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా సులభంగా తయారుచేసే వాటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వీటిలో ఎక్కువగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు ఫిట్‌గా ఉండాలంటే మరి ఏం చేయాలని అనుకుంటున్నారా? అదే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఉదయం తినే టిఫిన్స్‌లో వాల్‌నట్స్‌ను ఉపయోగించి అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. అయితే వాటిని ఎలా తీసుకోవాలి, అసలు అందులో ఏమున్నాయో తులుసుకుందాం.
వాల్‌నట్స్‌లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ కాంపౌండ్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. రోజూ వాల్ నట్స్ తినడం వల్ల మీ మెదడు చాలా పదునుగా ఉంటుంది. వాల్‌నట్స్ మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
1. పెరుగుతో వాల్‌నట్స్
రాత్రిపూట 4 లేదా 5 వాల్‌నట్‌లను నీళ్లలో నానబెట్టాలి. ఒక కప్పు పెరుగుతో కలిపి ఉదయాన్నే తినాలి. ఇంకా కావాలంటే ఈ మిశ్రమానికి ఓట్స్ కూడా జోడించవచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దానిలో పోషకాల పరిమాణం మరింత పెరుగుతుంది.
2. ఈవినింగ్ స్నాక్స్..
సాయంత్రం ఆకలిని తీర్చడానికి కుకీలు ఉప్పులకు బదులుగా, కొన్ని వాల్‌నట్స్‌లను తీసుకోండి. అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
3. స్మూతీస్
స్మూతీలకు ఆరోగ్యకరమైన అదనపు పోషకాలు ఇవ్వడానికి మీరు రోజువారీ పానీయంతో వాల్‌నట్‌లను ఉపయోగించవచ్చు. మీరు దీనిని అల్పాహారంలోనూ తీసుకోవచ్చు.
4. సలాడ్
మీరు సలాడ్ తినాలనుకుంటే, దానికి కొన్ని వాల్‌నట్ ముక్కలను జోడించవచ్చు. ఇది సలాడ్‌లోని పోషకాలను పెంచడానికి పనిచేస్తుంది. వీటిని డిప్స్, సాస్‌లలో కూడా ఉపయోగించవచ్చు.
5. చేప, చికెన్‌తో పాటు..
వాల్‌నట్‌లను గ్రైండ్ చేసి చేపలు, చికెన్‌పై పూతలా రాసి ప్రే చేసుకోవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా పోషక విలువలను కూడా పెంచుతుంది.
యాంటీఆక్సిడెంట్లు – వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, మెలటోనిన్, మొక్కల సమ్మేళనం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు- వాల్‌నట్‌లో ఇతర గింజల కంటే ఎక్కువ ఒమేగా -3 ఉంటుంది. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరును పెంచడంలోనూ సహాయపడుతుంది.
Also Read: Tea Types: ‘టీ’లో రకాలు.. ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ప్రయోజనాలో మీకు తెలుసా?..
Egg Recipes: గుడ్డు వెరీ గుడ్డు.. కోడి గుడ్డుతో ఈ సారి డిఫరెంట్ చేసి చూడండి.. ఆ రుచి అద్భుతం..