Turmeric Milk Health Benefits: పాలల్లో సాధారణంగా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలుంటాయి. అయితే.. ఆ పాలల్లో కొంచెం పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని పలు అధ్యయానాల్లో కూడా నిరూపితమైంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో పసుపు పాలు తాగి ఇమ్యూనిటీని పెంచుకోవాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. పసుపు పాలల్లో యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం పసుపు కలిపిన పాలను ‘సూపర్ మిల్క్’ అని సంబోధిస్తారు. ఇలాంటి పాలను రాత్రివేళ పడుకునే ముందు తాగితే.. మంచిగా నిద్ర పట్టడంతోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పసుపు పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం.
• పసుపు పాలల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీబయోటిక్స్ మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని పోషకాలు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి.
• దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. కఫం ఎక్కువగా ఉండి దగ్గుతో ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తాగితే మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
• పసుపు పాలల్లో ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. పాలలో సెరటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగించేందుకు దోహదపడుతుంది.
• ప్రతిరోజూ మంచి నిద్ర కోసం.. రాత్రి వేళ పసుపు కలిపిన పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగితే ప్రశాంతత లభించి.. త్వరగా బాగా నిద్రపోవచ్చు.
• పసుపు పాలతో రోగనిరోధక శక్తి పెరుగుతోంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే.. అది మిమ్మల్ని వ్యాధుల నుంచి రక్షించడంతోపాటు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
• పసుపు పాలతో మలబద్దకం.. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు ఉదర సమస్యలు ఉత్పన్నం కావు. అలాగే శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: