Red Chilli Health Benefits: కారం తింటే దీర్ఘకాలిక వ్యాధుల నివారణ సహా రోగనిరోధక శక్తి పెంచుతుంది అంటున్న పరిశోధకులు

|

Jan 07, 2021 | 3:18 PM

భారతీయ వంటకాలను కారం లేకుండా ఊహించడం కష్టం.. ఓ వైపు నోరు మండిపోతున్నా... మంచినీరు తాగుతూ.. మరీ వంటలను ఊరగాయాలను ఆస్వాదిస్తారు. అయితే మారుతున్న జీవన ప్రమాణాల్లో..

Red Chilli Health Benefits: కారం తింటే దీర్ఘకాలిక వ్యాధుల నివారణ సహా రోగనిరోధక శక్తి పెంచుతుంది అంటున్న పరిశోధకులు
Follow us on

Red Chilli Health Benefits: భారతీయ వంటకాలను కారం లేకుండా ఊహించడం కష్టం.. ఓ వైపు నోరు మండిపోతున్నా… మంచినీరు తాగుతూ.. మరీ వంటలను ఊరగాయాలను ఆస్వాదిస్తారు. అయితే మారుతున్న జీవన ప్రమాణాల్లో భాగంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి.  దీంతో కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని .. ఇలా రకరకాల కారణాలతో ఊరగాయ పచ్చడి నోరూరిస్తున్నా తినాలనే  కోరిక ఉన్నా బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నారు. కారం తింటే ఆరోగ్యానికి మంచిదే అంటూ అమెరికన్ పరిశోధకులు తెలిపారు.  మిరపకాయలను తినేవారిలో క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలిందంటూ ప్రకటించింది. మిరపకాయలు, మిరియాలు విస్తృత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని యుఎస్ పరిశోధకులు కనుగొన్నారు . వీటిలో కణితులు, మంటలను ఎదుర్కోవడంతో పాటు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 5,70,000 మందికి పైగా ప్రజల ఆహారపు అలవాట్లు , వారి ఆరోగ్యం పై పలు పరిశోధనలను ఓ బృందం పరిశోధనలు చేసింది.

“మిరపకాయను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల వ్యాధుల యొక్క తీవ్రతను తగ్గించవచ్చని ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధకుడు కార్డియాలజిస్ట్ బో జు” చెప్పారు. తమ అధ్యయనంలో, చైనా, ఇరాన్, ఇటలీ, యుఎస్ డేటాను సేకరించారు. మొత్తం ఆరోగ్యంలో ఆహార కారకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని డాక్టర్ జు తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని, తద్వారా డయాబెటిస్ ఊబకాయం రెండింటి నుంచి కారం రక్షణ కల్పిస్తుందని బృందం అభిప్రాయపడింది. అంతేకాదు  ఎండు మిర్చి , మిరియాల్లో విటిమిన్ ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించి దీర్ఘకాలిక వ్యాధులపై పోరాడడానికి శక్తిని ఇస్తుంది. అంతేకాదు ఎర్ర కారం లో చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్త నాళాలోని,  ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త సరఫరాకు దోహద పడతాయి. తద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది. ఇదే విషయం పై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మరియు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పోషకాహార నిపుణుడు పెన్నీ క్రిస్-ఈథర్టన్  స్పందిస్తూ.. ఈ ఫలితాలు నిజంగా చాలా గొప్పవని భావిస్తున్నామని  చెప్పారు.

ఏది ఏమయినప్పటికీ మనం వంటల్లో రోజూ వాడే మిరపకాయ,  మన శరీరానికి రక్షణను ఎలా ఇస్తుంది, వాటిని ఎంత తరచుగా తినాలి అనేదానిని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెప్పారు. అయితే కారం మంచిదే అన్నారు కదా అని మరీ ఎక్కువ తినకండి..   ఎందుకంటే అతి ఎప్పుడు అనర్ధాన్ని కలిగిస్తుంది.

Also Read: ఓ వైపు కరోనా కల్లోలం, మరోవైపు బర్ద్ ఫ్లూ భయం.. దేశవిదేశాల్లో కలవరం.. మానవాళికి సవాల్