Jamun Benefits: ఈ గింజల పొడి వాడి చూడండి.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!

వేసవి కాలంలో మనకు మార్కెట్లలో ఎక్కువగా కనిపించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. చిన్నప్పుడు చాలా మంది వీటిని ఇష్టంగా తిని ఉంటారు. అయితే ఈ పండ్లలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా నేరేడు విత్తనాలను మనం పెద్దగా గుర్తించము. కానీ ఈ విత్తనాలు మన ఆరోగ్య సమస్యలకు మంచి సహాయకారిగా నిలుస్తున్నాయి. ఈ విత్తనాల పొడి ఎన్నో రోగాలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ విత్తనాల పొడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jamun Benefits: ఈ గింజల పొడి వాడి చూడండి.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..!
Jamun Health Benefits

Updated on: May 26, 2025 | 12:50 PM

నేరేడు విత్తనాల పొడిలో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం వంటి సాధారణ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఉదయం పరగడుపున తీసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.

నేరేడు విత్తనాల పొడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజ పదార్థాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి షుగర్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

ఈ విత్తనాల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో చేరిన విష పదార్థాలను బయటకు పంపించడంలో ఇది సహాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు దాని పని తీరును మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో నేరేడు విత్తనాల పొడిని తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరంలోని కొవ్వు కరగడానికి ఇది సహాయపడుతుంది. దీనివల్ల క్యాలరీలు వేగంగా ఖర్చయి బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

నేరేడు విత్తనాల్లో ఉండే పోషకాలు ఇన్సులిన్‌ తో పాటు ఇతర హార్మోన్లను కూడా సమతుల్యంలో ఉంచుతాయి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), పీరియడ్స్ సంబంధిత సమస్యలు ఉన్న మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

ఈ విత్తనాల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలు, మచ్చలు, మంట, వాపు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. చర్మానికి మెరుపును తీసుకురావడంలో ఇది తోడ్పడుతుంది.

నేరేడు విత్తనాల పొడిలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరాన్ని వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చే వారికి ఇది సహాయకారి.

ఈ విత్తనాల పొడిలో ఫ్లేవనాయిడ్లు, పొటాషియం వంటి గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. రక్తపోటు స్థాయిని నియంత్రించి గుండె సంబంధిత రోగాల నుంచి రక్షణ కలిగిస్తాయి.

సహజంగా లభించే ఈ విత్తనాల పొడిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అయితే దీన్ని వాడే ముందు నూటికి నూరు శాతం స్వచ్ఛమైనదేనా అని నిర్ధారించుకోవడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)