Green Peas: మగాళ్లూ మీకోసమే.. రోజూ పచ్చి బఠాణీలు తింటున్నారా.? అయితే ఆ సమస్యకు చెక్ పడ్డట్లే!

|

Sep 15, 2022 | 7:04 PM

పచ్చి బఠాణీలు.. ప్రతీ ఒక్కరి వంటింట్లోనూ ఉండే ఈ ఆహార పదార్ధంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Green Peas: మగాళ్లూ మీకోసమే.. రోజూ పచ్చి బఠాణీలు తింటున్నారా.? అయితే ఆ సమస్యకు చెక్ పడ్డట్లే!
Green Peas
Follow us on

పచ్చి బఠాణీలు.. ప్రతీ ఒక్కరి వంటింట్లోనూ ఉండే ఈ ఆహార పదార్ధంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు కూరల్లో, కుర్మాల్లో రుచిని మరింతగా పెంచేందుకు పచ్చి బఠాణీలు వాడితే.. మరికొందరు వాటిని స్నాక్స్‌గా తింటుంటారు. ప్రతీ రోజూ పచ్చి బఠాణీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్‌ ఎక్కువగా ఉండటమే కాదు.. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

పచ్చి బఠాణీలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మలబద్దకం, జీర్ణ సమస్యలను సైతం దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఈ పచ్చి బఠాణీలు మంచి ఆప్షన్. గుండె జబ్బులను దరికి చేరనివ్వవు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. రోజూ పచ్చి బఠాణీలు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. ఫలితంగా రక్తహీనత సమస్య తగ్గిస్తుంది. ఇక విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

కాగా, పురుషులకు పచ్చి బఠాణీలు ఎంతో మేలు చేస్తాయి. శుక్ర కణాలు సంఖ్య పెరగడంలో సహాయపడతాయి. రోజూ పచ్చి బఠాణీలు తినడం వల్ల శుక్ర కణాలు దృడంగా మారడమే కాదు.. వాటి కదిలే సామర్ధ్యం కూడా పెరుగుతుంది. ఫలితంగా సంతాన లోపం సమస్య ఉండదు.