Summer Tips: పొట్ట ఆరోగ్యం టు వెయిట్‌ లాస్.. వేసవిలో వడదెబ్బకు ‘గోండ్ కతిరా’తో చెక్

సమ్మర్‌‌ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ఏవేవో పదార్ధాలు ట్రై చేసేస్తుంటాం. ప్రతి దానితోనూ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అయితే అందరికీ అన్ని పడవు. అందుకే సహజంగా లభించే పదార్ధాలకు వాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. చాలామంది సబ్జా గింజలు నానబెట్టి తాగితే మరొకొందరు వేరే వేరే పదార్ధాలను వాడటానికి ఆసక్తి చూపిస్తారు.

Summer Tips: పొట్ట ఆరోగ్యం టు వెయిట్‌ లాస్.. వేసవిలో వడదెబ్బకు ‘గోండ్ కతిరా’తో చెక్
Gond Katira .jpg

Updated on: Mar 23, 2026 | 8:47 PM

వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. బాహ్య ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందడానికి మనం రకరకాల శీతల పానీయాలను ఆశ్రయిస్తుంటాం. అయితే, కృత్రిమ పానీయాల కంటే సహజ సిద్ధమైన చల్లదనాన్ని ఇచ్చే గోండ్ కతిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే ‘ట్రాగాకాంత్ గమ్’ అని కూడా పిలుస్తారు. మన వంటింటి మసాలా డబ్బాలో ఉండే ఈ చిన్న పదార్థం, పొట్ట ఆరోగ్యానికి ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.

  • ICMR, CBHI వంటి ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం, నేడు 80% మంది ప్రజలు అసిడిటీ లేదా గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఆస్ట్రాగ‌ల‌స్ అనే మొక్క నుండి వచ్చే గోండ్ కతిరా ఒక వరప్రసాదం.
  • సింథటిక్ కూలింగ్ డ్రింక్స్ తాత్కాలిక చల్లదనాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ గోండ్ కతిరా ఒక సహజ ‘ప్రీబయోటిక్’. ఇది మన జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. తద్వారా పేగుల ఆరోగ్యం మెరుగుపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఇందులో ఉండే కరిగే ఫైబర్ మలాన్ని మృదువుగా చేసి, మలబద్ధకం సమస్యను సులభంగా తొలగిస్తుంది.
  • నీటిలో నానబెట్టినప్పుడు ఇది జెల్‌లా మారుతుంది. ఇది జీర్ణాశయ గోడలపై ఒక రక్షణ పొరలా ఏర్పడి, గుండెల్లో మంటను మరియు యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గిస్తుంది.
  • గోండ్ కతిరాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల దీనిని తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అలాగే, ఇది శరీరంలో నీటిని నిల్వ ఉంచే లక్షణాన్ని కలిగి ఉండటం వల్ల డీహైడ్రేషన్, వేసవి అలసటను తగ్గిస్తుంది.

జాగ్రత్తలు..

గోండ్ కతిరాను వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

  • నానబెట్టడం: దీనిని ఎప్పుడూ ఎండిన రూపంలో తీసుకోకూడదు. కనీసం 8 గంటలు నీటిలో నానబెట్టి, జెల్‌లా మారిన తర్వాతే పానీయాల్లో కలుపుకోవాలి.
  • నీరు ఎక్కువగా తాగాలి: ఇది శరీరంలోని నీటిని గ్రహిస్తుంది కాబట్టి, దీనిని వాడేవారు రోజుకు 2-3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.
  • మందులతో జాగ్రత్త: మీరు ఏవైనా మందులు వాడుతుంటే, ఆ మందులు వేసుకున్న 2 గంటల తర్వాతే గోండ్ కతిరా తీసుకోవాలి.

ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఉండే కూల్ డ్రింక్స్ మన జీర్ణాశయానికి హానికరం. వాటికి బదులుగా సహజమైన గోండ్ కతిరాను నిమ్మరసం లేదా పాలతో కలిపి తీసుకోవడం వల్ల చల్లదనంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Follow Us