Health Tips: ప్రజలు ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ, దోసలను చాలా ఉత్సాహంగా తింటారు. కానీ అవి పులియబెట్టిన ఆహారాలు అని మీకు తెలుసా.. ఇలాంటి ఆహారాలు శరీరానికి చాలా మంచివి. ఇవి తింటే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నిపుణులు డైట్‌లో పులియబెట్టిన ఆహారాలు ఉండాలని సూచిస్తారు. ఆహారాన్ని పులియబెట్టడాన్ని కిణ్వ ప్రక్రియ అంటారు. ఇందులో ఈస్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పులియబెట్టిన తర్వాత తయారుచేసిన పిండి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఇందులో ఉండే బ్యాక్టీరియాను ప్రోబయోటిక్స్ అంటారు. పులియబెట్టిన ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
మీరు పులియబెట్టిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు పులియబెట్టిన ఆహారాలపై దృష్టి సారిస్తే మంచిది.
2. బరువు తగ్గిస్తుంది
పులియబెట్టిన ఆహారాన్ని సరైన మార్గంలో తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. ప్రజలు ఇడ్లీలని ఎక్కువగా తింటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఆవిరితో ఉడకడం వల్ల ఇది శరీరానికి హాని కలిగించదు. అంతేకాదు కడుపు నిండిన భావన కలిగితే మీరు బయటి వస్తువులను తినకుండా ఉంటారు.
3. జీవక్రియలో మెరుగుదల
పులియబెట్టిన ఆహారాలు తేలికగా, సులభంగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని యాంటీ-ఆక్సిడెంట్ల అవసరాన్ని తీరుస్తాయి. అంతేకాదు పులియబెట్టిన ఆహారాల ద్వారా శరీరానికి విటమిన్ B-12 పుష్కలంగా లభిస్తుంది.
4. వాపులని తగ్గిస్తాయి
శరీరంలో వాపులుంటే పులియబెట్టిన ఆహారాలని తింటే సరిపోతుంది. అయితే వీటిని తయారుచేసేటప్పుడు తక్కువ నూనె ఉపయోగించాలి. ఎక్కువ నూనె ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. పులియబెట్టిన ఆహారాలలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పెరుగులో ఉంటుంది. మన శరీరంలో మంచి బాక్టీరియాను పెంచుకోవాలంటే చక్కెరను బాగా తక్కువగా తీసుకోవాలి. వీలుంటే పూర్తిగా మానేయాలి. చక్కర వల్ల శరీరంలో మంచి బాక్టీరియా నశించి చెడు బాక్టీరియా పెరుగుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.