ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలు విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ డీ, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఈ కారణంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. ఇందుకోసం ప్రతి రోజు నిద్రపోయే ముందు రెండే రెండు ఖర్జూరాలు తీసుకుంటే చాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాలను తీసుకున్న తర్వాత ఓ గ్లాస్ పాలు తాగితే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో పడుకునే ముందు ఖర్జూరాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
బలమైన ఎముకలు: ఖర్జూరాల్లో ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉన్నందున ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అలాగే ఎముకల సాంద్రతను మెరుగు పరిచి, బోలు ఎముకల సమస్యను నివారిస్తాయి. దంతాలు కూడా దృఢంగా ఉంటాయి.
కంటి చూపు: ఖర్జూరాలను తీసుకోవడం వల్ల కళ్లకు కూడా మేలు జరుగుతుుంది. ఖర్జూరాల్లో కంటి చూపును మెరుగు పరిచే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.
రోగ నిరోధక శక్తి: విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లకు ఖర్జూరాలు మంచి మూలాలు. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచి దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
మెరుగైన జీర్ణక్రియ: ఖర్జూరాల్లో ప్రోటీన్, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచడంలో పని చేస్తాయి. ఫలితంగా మలబద్ధకం, కడుపు మంట, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
గుండె ఆరోగ్యం: ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్, పొటాషియం వంటి గుండెకు మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చర్మ, కేశ సంరక్షణ: ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు 2 ఖర్జూరాలు తింటే జుట్టు, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఖర్జూరాల్లో విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడమే ఇందుకు కారణమని చెప్పాలి. ఇవి చుండ్రు, పొడి జట్టు, జుట్టు రాలడం, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను నివారించి కేశాలను బలోపేతం, చర్మం మెరిసేలా చేస్తాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..