Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..

|

Mar 22, 2022 | 2:22 PM

Amaranth Health Benefits: కొర్రల (అమర్‌నాథ్ ఫుడ్) లో అధిక పీచు పదార్ధం, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీష్యం, భాస్వరంతో విటమిన్స్ ఆర్థిక పళ్ళోలో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహరం.

Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..
Amaranthus Caudatus
Follow us on

కొర్రలు (అమర్‌నాథ్ ఫుడ్)(Amaranth) తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగస్థులకిది మంచి ఆహరం. శరీరం లోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తాగిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు ఆర్థికంగా ఉంటాయి. కొర్రల (అమర్‌నాథ్ ఫుడ్) లో అధిక పీచు పదార్ధం, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీష్యం, భాస్వరంతో విటమిన్స్ ఆర్థిక పళ్ళోలో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహరం అని చెప్పవచ్చు. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొపి, మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, ఆకలిమాధ్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఓషధహారం. మాంసకృత్తులు, ఇనుము ఆర్థికంగా ఉండటం వలన రక్త హీనత నివారణకు చక్కటి ఓషధం. పీచు పధార్ధంఅధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో జ్వరం వచ్చినపుడు కొర్ర జంగి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే జ్వరం తగిపోతుందని పేదల అనుభవం. గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్ళవాతం, రక్తశ్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.

మనం మన శరీరానికి సరైనా ఆహారం, పోషకాలతో ఉన్నది ఇవ్వడం అత్యవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకర ఆహారం తినాలి. మన చుట్టూ ఎన్నో రకాల ధాన్యాలున్నాయి. అన్నీ సరైన ఆరోగ్యాన్నే ఇవ్వవు. అమర్‌నాథ్ అనేది. పురాతన కాలం నుంచి వాడుతున్న పోషకాహారం. ఇందులో చిన్న సైజులో ఉండే గింజలు.. ప్రోటీన్స్‌తో నిండివుండాయి. వీటిని వేపుకొని, పాప్‌కార్న్‌లా, ఉడకబెట్టి..ఇలా రకరకాలుగా తినవచ్చు. ఇతర ఆహారాలతో కలిపి కూడా తినవచ్చు. ప్రోటీన్స్‌తోపాటూ.. ఇందులో ఫైబర్, విటమిన్స్, మిరల్స్ కూడా ఎక్కువే.

అరికెలు(అమర్‌నాథ్ ఫుడ్) వల్ల ఉపయోగాలు :

  1. ఇందులో విటమిన్లు A, C, E, K, B5, B6, ఫొలేట్, నియాసిన్, రైబోఫ్లావిన్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలోని విష వ్యర్థాలను తరిమికొడతాయి.
  2.  వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే అమర్‌నాథ్ గింజలు తినాలి.
  3.  డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్ ఉండటం వల్ల ఇవి రక్తంలో వెంటనే కరిగిపోవు. అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు.
  4. ఇందులో ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, రాగి (కాపర్), జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉండటం వల్ల ఇవి మన బాడీని రాయిలా చేస్తాయి. డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడతాయి.
  5. మల బద్ధకం, అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ ఫుడ్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
  6.  అరికెలు(అమర్‌నాథ్‌)లోని కాల్షియం, ఫాస్పరస్ అనేవి… ఎముకల్ని ధ్రుడంగా, గట్టిగా, బలంగా, రాడ్డుల్లా మార్చేస్తాయి. మన దంతాలకు చాలా మంచింది.
  7. అమర్‌నాథ్ గింజల్లోని నూనెలు, పైటోస్టెరాల్స్ వంటివి… శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

షాపుల్లో ఈ అరికెలు అనే ఆహారం.. గింజల రూపంలో, పొడి (పిండి) రూపంలో లభిస్తుంది. కొద్దిగా తియ్యగా ఉంటుంది. ఈ పొడిని సూప్స్‌లో కూడా వేసుకోవచ్చు. స్వీట్లలో కూడా వాడొచ్చు. పాలకూర లాగా.. అమర్‌నాథ్ మొక్కల ఆకులను కూడా వండుకొని తినవచ్చు. రోజూ అరికెలు ఆహారం తినమని కొందరు డాక్టర్లు సూచిస్తున్నారు. గంటల తరబడి నీరసం రాకుండా ఉండేందుకు ఈ ఆహారం బాగా ఉపయోగపడుతోంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?

Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..