Benefits Of Potatoes: బంగాళాదుంపలు నోటి క్యాన్సర్ వంటి ఎన్నో వ్యాధులకు ఔషధం.. తినడం తిరస్కరించవద్దు.. అయితే…

|

Feb 23, 2021 | 1:44 PM

బంగాళాదుంపలు ఇది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఇది చాలా మందికి ఫేవరేట్ కూడా. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువుగా ఇష్టంగా తినే కూరగాయల్లో ఇది ఒకటి. దీనిలో కార్బోహైడ్రేట్స్, పిండిపదార్థాలు ఎక్కువగా...

Benefits Of Potatoes: బంగాళాదుంపలు నోటి క్యాన్సర్ వంటి ఎన్నో వ్యాధులకు ఔషధం.. తినడం తిరస్కరించవద్దు.. అయితే...
Follow us on

Benefits Of Potatoes: బంగాళాదుంపలు ఇది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఇది చాలా మందికి ఫేవరేట్ కూడా. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువుగా ఇష్టంగా తినే కూరగాయల్లో ఇది ఒకటి. దీనిలో కార్బోహైడ్రేట్స్, పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటితో పాటు మరెన్నో శరీరానికి ఉపగయోగపడే పదార్థాలు దీంట్లో ఉన్నాయి. అసలు బంగాళా దుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..!

* బంగాళదుంప లో బరువు పెరగడానికి సవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీంతో మరీ సన్నగా ఉన్నారు బంగాళాదుంపలను తీసుకోవడంతో బరువు పెరుగుతారు.
* బంగాళా దుంప చాలా తేలికగా జీర్ణమవుతుంది. దీంతో పిల్లలకి, పేషెంట్లు కి దీనిని పెట్టడం వల్ల సులువుగా ఇది అరుగుతుంది. పైగా శక్తి కూడా ఇస్తుంది.
* కడుపు లో మంటను తగ్గించడానికి బంగాళ దుంప బాగా పని చేస్తుంది. ఆమ్లతను తగ్గించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయని, కడుపులోని ఇతర సమస్యలను తొలగిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది.
* నోటి క్యాన్సర్ కు చికిత్స గా కూడా బంగాళాదుంప ఉపయోపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
*పచ్చి బంగాళదుంప ముద్దని కాలిన గాయాలకు రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
*గుండె జబ్బులు తగ్గించడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది.
*బంగాళాదుంపలు ఉడికించి నీళ్ళు కీళ్ళ నొప్పులకు బాగా పని చేస్తాయి.
బంగాళాదుంప రసంలో విటమిన్ ‘బి’ కంటెంట్ మరియు యాంటీఆక్సిడెంట్లను పెంచుతుంది మరియు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని అన్ని చర్మ కణాలకు రక్తం ప్రవహిస్తుంది చర్మంపై ముడతలు, చర్మంపై మచ్చలు మాయమవుతాయి.
*ఇందులో ఉండే విటమిన్స్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్ , జింక్ చర్మానికి ఎంత గానో మేలు చేస్తాయి. కనుక చర్మ సంరక్షణకు బంగాళాదుంపను ఉపయోగించ వచ్చు. దీనిని క్రష్ చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు.

బంగాళా దుంపలు రుచికి రుచి ఆరోగ్య పరంగా మంచివే.. అయితే ఎప్పుడైనా అతి సర్వత్రా వర్జయేత్.. నచ్చాయి.. ఆరోగ్యం అంటున్నారు కదా అని ఎక్కువగా తింటే.. చేతులు, కాళ్ళలోని నరాలు పట్టేస్తుంటాయి.

Also Read:

కోవిడ్ వ్యాక్సిన్లను అందజేయకుండా చూస్తున్నాయి, ధనిక దేశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫైర్

ములక్కాయ గురించి మీకు తెలుసా..? గర్భిణులు ఈ కాయను తినొచ్చా..! అసలు రహస్యం ఏంటి.. తెలుసుకోండిలా..