Health Benefits: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా? మాంసం తింటే గానీ ప్రాణం కుదిట పడదా? అయితే మీకోసమే ఈ వార్త. నాన్ వెజ్ తినేవారికి అలర్జీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అలర్జీ రావడం.. వైద్యులను విస్మయానికి గురి చేస్తుంది. వాస్తవానికి నాన్‌వెజ్ తింటే.. ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ ప్రస్తుత పరిశోధనలు.. మాంసం అలర్జీలకు కారణం అని చెబుతున్నారు.
తాజాగా అమెరికాలో ఇలాంటి కొన్ని కేసులు వెలుగు చూశాయి. ఇందులో నాన్ వెజ్ తిన్న తరువాత చాలామందిలో అలెర్జీ సమస్యతో బాధపడినట్లు తేలింది. తమ వద్దకు వచ్చిన బాధితులకు అలర్జీతో బాధపడున్నట్లుగా గుర్తించిన వైద్యులు.. దానికి కారణమేంటో గుర్తించలేకపోయారు. ఆ తరువాత నాన్‌వెజ్ కారణంగానే ప్రజలు అలర్జీ బారిన పడుతున్నారని వైద్యులు నిర్ధారించారు.
అలర్జీ ఎందుకు వస్తుంది..
మాంసం ద్వారా అలర్జీ అంటే ముందుగా వైద్యులు అంగీకరించలేదు. ఆ తరువాత పరిశోధనలు జరుపగా.. నాన్‌వెజ్ తినడం వల్లే అలర్జీ వస్తుందని నిర్ధారించారు. డీడబ్ల్యూ నివేదిక ప్రకారం.. ఒక ప్రముఖ అమెరికన్ వైద్యులు ఈ కేసు గురించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘అలర్జీతో బాధపడుతున్న రోగులు వైద్యం కోసం వచ్చారు. వారు ముందు రోజు నాన్‌వెజ్ తిన్నట్లుగా చెప్పారు. వారు చెప్పినదాంట్లో అర్థం లేదని భావించాను. కానీ, అల్ఫాగల్ అనే అలర్జీ రోగిపై పరిశోధన చేయగా.. ఒక చిన్న కణంలో యాంటీబాడీ కనుగొనడం జరిగింది. అల్ఫాగల్‌కు ప్రతిరోధకాలలో అలర్జీ సింప్టమ్స్ కనిపించాయి.’’ అని చెప్పుకొచ్చారు. నాన్‌వెజ్ తినడం ద్వారా కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ప్రజలకు ఆయన సూచించారు. ఏదేమైనా.. అమెరికాలో ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుండటం అందరినీ కలవరానికి గురిచేస్తుంది.
Also read:
Manchu Lakshmi: మేమంతా ఒకటే..పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న మంచు లక్ష్మి
Bank Holidays: వచ్చేవారం బ్యాంకులకు 6 రోజులు హాలిడేస్.. పూర్తి వివరాలివే..