Wheatgrass: మలబద్ధకం, గర్భసంబంధం వ్యాధులతో బాధపడేవారికి దివ్యౌషధం ఈ రసం.. రోజు 4 గ్లాసులు తాగితే అద్భుత ఫలితం

|

Aug 07, 2021 | 10:12 AM

Wheatgrass Juice: గోధుమగడ్డి రసానికి ప్రకృతి వైద్యంలో మంచి ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల్లో ఉండే పోషకాలు ఉంటాయని..

Wheatgrass: మలబద్ధకం, గర్భసంబంధం వ్యాధులతో బాధపడేవారికి దివ్యౌషధం ఈ రసం.. రోజు 4 గ్లాసులు తాగితే అద్భుత ఫలితం
Wheatgrass Juice
Follow us on

Wheatgrass Juice: గోధుమగడ్డి రసానికి ప్రకృతి వైద్యంలో మంచి ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల్లో ఉండే పోషకాలు ఉంటాయని అనుభవజ్ఞులు చెపుతున్నారు. దీంతో గోధుమ గడ్డిని ‘జీవం కలిగిన ఆహారం గా ‘ పేర్కొనవచ్చు. దీనీలో విటమిన్ “ఈ ‘తో పాటు ఇతర పోషకాలు ఉన్నాయి.అయితే చాలామందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది.

డాక్టర్ థామస్ అనే పరిశోధకుడు కూడా ఈ గడ్డిపైనా చాలా అద్భుతపరిశోధనలు చేశాడు. ఈ గడ్డిలో జీవమున్న ఖనిజాలు , విటమిన్లు , ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి అని కనుగొన్నాడు. ఒక ఆరోగ్యవంతుడి రక్తములో ఉండే అన్ని రకాల పదార్ధాలు ఈ గోధుమగడ్డి రసంలో ఉన్నాయి. ఈ గోధుమగడ్డి రసానికి “ఆకుపచ్చ రక్తం ” అని కూడా పేరుంది. కాన్సర్ తో బాధపడేవారు ఒక గ్లాసు గోధుమ గడ్డి రసాన్ని రోజుకి నాలుగుసార్లు తీసుకుంటే అద్భుత ఫలితం ఇస్తుంది.

ఈ గోధుమగడ్డికి జీవమున్న ఆహారమని పేరు. దీనిలో ఉండే “క్లోరోఫిల్” రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . గోదుమగడ్డి రసంలో ఉండు క్లోరోఫిల్ పార్టికల్స్ హిమోగ్లోబిన్ ని పోలి ఉంటాయి. అందువల్ల రక్తహీనతకు ఐరన్ లా పనిచేస్తుంది. ఈ క్లోరోఫిల్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరవ్యవస్థను , పేగులను , మూత్రకోశం, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావితం చూపిస్తుంది. గోధుమగడ్ది లో కేన్సర్ నివారణకు ఉపయోగపడు B17 పెద్దమొత్తంలో ఉంది. శరీరంలో 30 రకాల ఎంజైములను చురుకుగా ఉంచడానికి అవసరం అయిన మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో తేలికగా లభ్యమగుతాయి.

గోధుమగడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజలు: 

చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం , గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , దీర్ఘకాలిక జలుబు , అగ్నిమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్ వంటి వ్యాధుల నివారణకు గోధుమ గడ్డి రసం చక్కని ఔషధం.

పైన చెప్పిన సమస్యలతో బాధపడేవారు రోజుకు నాలుగు గ్లాసుల చొప్పున రెగ్యులర్ గా 21 రోజులపాటు తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందవచ్చు.

Also Read: మధ్యాహ్న భోజనం సమయంలో ఈ ఐదు ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటే షుగర్‌ నియంత్రణ..!