Health Tips: విపరీతమైన పని ఒత్తిడికి తోడు బిజీ లైఫ్ కారణంగా మనలో చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. తీవ్ర అలసట, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని ఎక్కువసేపు చూడటం వంటి కారణాల వల్ల తలనొప్పి రావడం సహజం. దీని నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే అనేక రకాల మందులను వాడుతుంటారు. అయితే దీర్ఘకాలంలో వీటి వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని హోం రెమెడీస్ ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.
పెప్పర్‌మెంట్ ఆయిల్..
పుదీనాలో పలు ఆరోగ్య గుణాలు ఉంటాయి. ఇవి తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. తలనొప్పి సమయంలో కాస్త పెప్పర్ మింట్ ఆయిల్ తీసుకుని నుదుటిపై మసాజ్ చేయాలి. ఆ తర్వాత కాసేపు నిద్రపోండి. కాసేపట్లో మీకు తేడా కనిపిస్త్ఉంది. ఇది కాకుండా మౌత్ వాష్‌గా కూడా పుదీనాను ఉపయోగించవచ్చు. అదే సమయంలో పుదీనా నూనె కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది.
చమోమిలే నూనె
సహజ ప్రయోజనాలతో కూడిన ఈ నూనె తలనొప్పి, దురద, చర్మశుద్ధి, చర్మంపై వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మార్కెట్లో ఈ రకమైన ఆయిల్స్ సులభంగా దొరుకుతున్నాయి. తలనొప్పి వచ్చినప్పుడు ఈనూనెతో నుదుటిపై రాసుకుని మర్దన చేయాలి. రాత్రి పడుకునే ముందు మసాజ్ చేసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే ఫ్రెష్ గా ఉండగలుగుతారు.
లావెండర్ నూనె
ఇది చర్మం, జుట్టు సంరక్షణ కాకుండా శరీర సంరక్షణలో ఉత్తమమైనది. పనిభారంతో కలిగే తీవ్ర అలసట, తలనొప్పి సమస్యలను తగ్గించడంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది. ఈ ఆయిల్‌తో నుదుటిని మసాజ్ చేస్తే మనసుకు రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇది ఎసెన్షియల్ ఆయిల్ అయినప్పటికీ, దీన్ని నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. కొబ్బరి లేదా ఇతర నూనెతో కలిపి మాత్రమే వాడాలి.
గమనిక: ఈ కథనంలోని అందించిన చిట్కాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా చిట్కాలను, పద్ధతులను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..