Beer Effects: ప్రతిరోజూ బీర్ తాగుతున్నారా?.. షాకింగ్ విషయాలు మీకోసమే..!

Beer Effects: వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది చిల్డ్ బీర్ తాగేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా యువత బీర్‌ గటగటా లాగించేస్తారు.

Beer Effects: ప్రతిరోజూ బీర్ తాగుతున్నారా?.. షాకింగ్ విషయాలు మీకోసమే..!
Beer
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 13, 2022 | 7:25 AM

Beer Effects: వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది చిల్డ్ బీర్ తాగేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా యువత బీర్‌ గటగటా లాగించేస్తారు. అయితే, బీర్ తాగడంపై జనాల్లో రకరకాల అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిక్ బాధితులు బీర్ తాగితే.. బ్లడ్‌‌లో షుగర్ లెవల్స్ భారీగా పెరుగుతాయని అంటారు. అయితే, బీరు తాగడం వలన శరీరంలో జరిగే పరిణామాలపై పరిశోధకలు నిర్వహించిన పరిశోధనలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రతి రోజూ ఒక బీర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచే జరుగుతుంది తప్ప చెడు జరుగుదని వెల్లడించారు పరిశోధకులు. మితం ఎప్పుడూ మంచే చేస్తుందన్నట్లుగా.. ప్రతి రోజూ ఒక బీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. ప్రతిరోజూ పరిమితి మేరకు బీర్ తాగితే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆరోగ్యకరమైన గుండె.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బీర్ సహాయపడుతుంది. పరిశోధకులు నిర్వహించిన ఒక పరిశోధనలో.. గుండెపోటుకు గురైన వ్యక్తులు కూడా 1 నుండి 1.5 లీటర్ బీర్ తీసుకున్న వారి గుండె చాలా ఆరోగ్యంగా మారిందని పేర్కొన్నారు.

2. వైన్ వర్సెస్ బీర్.. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని ఒక అధ్యయనం ప్రకారం.. వైన్ కంటే బీర్‌లో ఎక్కువ ప్రోటీన్, విటమిన్ బి ఉన్నాయి. అదనంగా, ఇది యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. అంటే అనేక వ్యాధులను నివారించడంలో బీర్ మంచి పాత్ర పోషిస్తుంది.

3. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, కొన్ని విభిన్న పరిశోధనలలో బీర్ వినియోగం మధుమేహాన్ని నియంత్రిస్తుందని వెల్లడైంది. అయితే, పరిమితి ప్రకారం తీసుకుంటేనే దాని ప్రయోజనాలు ఉంటాయని, అతిగా తీసుకుంటే ముప్పు తప్పదని కూడా వెల్లడించారు.

4. ఎముకలు బలంగా.. బీర్ ఎముకల ఆరోగ్యానికి మంచి టానిక్‌గా పనిచేస్తుంది. ఎముకలు దృఢంగా ఉండటానికి సిలికాన్ అవసరం. బీరులో సిలికాన్ పరిమాణం గణనీయంగా ఉంటుంది.

5. ఆరోగ్యకరమైన దంతాలు.. బీర్ మీ దంతాలలో కావిటీస్, క్షయం కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. అయితే, మితంగా తీసుకుంటేనే బీరు ప్రయోజనాలను పొందగలరని, లేదంటే అనారోగ్యానికి గురికాక తప్పదని నిపుణులు తేల్చి చెప్పారు. (గమనిక: పరిశోధకులు తెలిపిన సమాచారం ప్రకారం దీనిని ప్రచురించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు.)

Also read:

Hair Care Tips: వేసవిలో అందమైన, మెరిసే జుట్టు కావాలా?.. అయితే, ఈ చిట్కాలను పాటించండి..!

US President Biden: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. గన్ కల్చర్‌పై ప్రత్యేక ఫోకస్..

Russia – Ukraine War: ‘అమ్మా స్వర్గంలో కలుస్తా!’.. రష్యా దాడిలో చనిపోయిన తల్లికి 9 ఏళ్ల బాలిక లేఖ..