Hair Loss: పురుషులలో అకస్మాత్తుగా బట్టతల రావడానికి ఇవే కారణాలు..!

|

Mar 05, 2022 | 9:22 PM

Hair Loss: జుట్టు రాలడం అనేక కారణాల వల్ల జరుగుతుంది. ఈ సమస్య సాధారణంగా రోజు రోజుకి పెరుగుతోంది. కానీ కొంతమంది పురుషులలో జుట్టు రాలడం అనేది అకస్మాత్తుగా మొదలవుతుంది.

Hair Loss: పురుషులలో అకస్మాత్తుగా బట్టతల రావడానికి ఇవే కారణాలు..!
Hair Loss
Follow us on

Hair Loss: జుట్టు రాలడం అనేక కారణాల వల్ల జరుగుతుంది. ఈ సమస్య సాధారణంగా రోజు రోజుకి పెరుగుతోంది. కానీ కొంతమంది పురుషులలో జుట్టు రాలడం అనేది అకస్మాత్తుగా మొదలవుతుంది. వేగంగా రాలుతూ బట్టతల ఏర్పడుతుంది. అధిక ఒత్తిడి, వైద్య పరిస్థితి, మందులు తీసుకోవడం లేదా పోషకాల కొరత కారణంగా పురుషుల జుట్టు రాలుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. అన్నింటిలో మొదటిది, పురుషులు తమ జుట్టును సరిగ్గా చూసుకోవాలి. దువ్వేటప్పుడు గట్టిగా లాగకూడదు. మంచి దువ్వెన వాడాలి. జుట్టుకు వేడి నూనెను రాయడం మంచిది కాదు. ఇది మీ జుట్టుని దెబ్బతీస్తుంది. మీ జుట్టు రాలడం మొదలవడానికి ఇదే ప్రధాన కారణం. రబ్బరు బ్యాండ్‌లు, బారెట్‌లు, బ్రెయిడ్‌లను ఉపయోగిస్తే జుట్టుకు ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వాటిని దూరంగా ఉంటే మంచిది.

ఒత్తిడి కారణంగా చాలా వరకు జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం యోగా సాధన చేస్తే మంచిది. వైద్యుని సలహా మేరకు మాత్రమే ఏ ఔషధాలైనా వాడాలి. ఎందుకంటే ఒక్కోసారి మందులు వాడినా కూడా జుట్టు రాలడం మొదలవుతుంది. సూర్యకాంతి, అతినీలలోహిత కాంతి ఇతర వనరుల నుంచి జుట్టును రక్షించండి. ధూమపానం పురుషులలో బట్టతలకి కారణం కావచ్చు కాబట్టి పొగాకు, ఆల్కహాల్ వాడటం మానేయండి.

ఐరన్ లోపం వల్ల కూడా పురుషులలో జుట్టు రాలుతుంది. తినే ఆహరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఐరన్ గ్రహింపబడక కొరత ఏర్పడి వెంట్రుకలు రాలుతాయి. ఐరన్ రిచ్ ఫుడ్స్‌ తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆర్థరైటిస్ (కీళ్ళ నొప్పులు), గుండె సమస్యలు, అధిక రక్త పీడనం, వంటి వ్యాధులకు మందులు వాడేవారు మాత్రమే కాకుండా ఎక్కువగా డిప్రెషన్’కు గురయ్యే వారు, రక్తం పలుచగా ఉండే వారిలో జుట్టు త్వరగా రాలిపోతుంది. అంతేకాకుండా అధిక మోతాదులో విటమిన్ ‘A’ సేకరణ వల్ల కూడా వెంట్రుకలు తెగిపోతాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Beard Itching: గడ్డం దురదగా ఉంటుందా.. మీరు ఈ తప్పులు చేస్తున్నారని అర్థం..!

Heart Attack: షేన్‌వార్న్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇలా చాలామంది.. చిన్నవయసులోనే గుండెపోటుకి కారణాలేంటి..?

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌తో సులభంగా బరువు తగ్గొచ్చు.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..