
మన రోజువారీ ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆపిల్ నుంచి అవాకాడో వరకు ప్రతి పండు శరీరానికి విలువైన పోషకాలను అందిస్తుంది. వీటిని మామూలుగా తినడమే కాకుండా.. షేక్స్, జ్యూస్ లు, సలాడ్‌లు, స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు. జామ, అవాకాడో ఈ రెండింటిలో ఏది మీ ఆరోగ్యానికి ఎక్కువ మంచిది..? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు, పోషక విలువలు, ఆరోగ్య లాభాలు, వాటిని ఎలా తినాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
జామను ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు, కారం చల్లి తినవచ్చు. జామ పేస్ట్, జ్యూస్, లేదా చట్నీగా కూడా తయారు చేసుకోవచ్చు.
అవాకాడోను మెత్తగా చేసి టోస్ట్‌పై స్ప్రెడ్‌గా తినడం ఒక ట్రెండీ మార్గం. దీన్ని సలాడ్ లలో, స్మూతీ లలో కలిపి లేదా గ్వాకామోల్‌గా తయారు చేసి శాండ్‌విచ్‌లలో ఉపయోగించవచ్చు.
ఈ రెండు పండ్లూ వేర్వేరు రకాల ఆరోగ్య లాభాలను అందిస్తాయి. ఏది మంచిదనేది మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
జామ.. ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నవారు జామను ఎంచుకోవచ్చు. దీనిలో తక్కువ కేలరీలు, ఎక్కువ విటమిన్ C ఉంటాయి.
అవాకాడో.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునేవారు, చర్మం, మెదడుకు పోషణ కావాలనుకునేవారు అవాకాడోను తీసుకోవచ్చు. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
పోషక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెండింటినీ సమతుల్యంగా మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్య లాభాలను పొందవచ్చు. ఒక పండును వదిలేసి మరొకటి మాత్రమే తీసుకోవడం కన్నా.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని తినడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)