చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద చాలా అవసరం. ముఖ్యంగా ఈ కాలంలో చర్మం పగుళ్లు, జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సీజన్లో ఉసిరి తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయంట. అవేంటో మీరు తెలుసుకోండి.
మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ ఉసిరిలో పుష్కలంగా దొరుకుతుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కంటే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చలికాలంలో దొరికే ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ సి లోపం దరిచేరదు. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉసిరి వలన ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ సీజన్లో వచ్చే చర్మ వ్యాధులు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని రోజూ వాడాలి. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఉసిరి రసాన్ని తాగడం వనల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ ఉసిరి కాయలను తినడం వలన కావల్సినంత క్రోమియం లభిస్తుంది. అలాగే ఇన్సులిన్ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. చలీకాలంలో ఉసిరి తీసుకోవడం వలన కలిగే లాభాలు తెలుసుకున్నారుగా.. అయితే ఉసిరిని అసలు తీసుకోకుండా ఉండకండి.