Pig Liver to Human: వైద్య రంగంలో మరో అద్భుతం.. మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?

చైనా వైద్యులు ప్రపంచ వైద్య చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. జన్యు మార్పులు చేసిన పంది కాలేయాన్ని మానవునికి అమర్చి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. బ్రెయిన్ డెడ్‌ రోగిపై చేసిన ఈ ప్రయోగం పది రోజుల పర్యవేక్షణ తర్వాత విజయవంతమైంది. కాలేయ మార్పిడికి ఎదురుచూస్తున్న వారికి ఇది గొప్ప ఆశాకిరణం.

Pig Liver to Human: వైద్య రంగంలో మరో అద్భుతం.. మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
Pig Liver Transplanted Into

Updated on: Mar 27, 2025 | 8:57 AM

వైద్యరంగ చరిత్రలోనే సరికొత్త అధ్యయం లిఖించారు చైనా డాక్టర్ల. లివర్‌ మార్పిడి ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి.. మనిషికి పంది లివర్‌ను అమర్చారు. మరో విశేషం ఏంటంటే.. మనిషికి అమర్చిన ఆ లివర్‌ ఎంతో బాగా పనిచేస్తోంది. పంది లివర్‌ను మనిషికి పెట్టడం అనేది ప్రపంచంలోనే ఇదే తొలిసారి. గతంలో అమెరికాలో పంది గుండె, కిడ్నీలను మనుషులకు అమర్చారు కానీ, లివర్‌ను మార్పిడి చేయడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ను. ఈ ఘనతను చైనా వైద్యులు సాధించారు. అయితే.. ఈ ప్రయోగాన్ని ఒక బ్రెయిన్‌ డెడ్‌ పేషెంట్‌పై చేశారు. అలాగే లివర్‌ను దానం చేసిన పంది సాధారణ పంది కాదు. దానిలో ముందుగానే జన్యుపరంగా కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత దాని నుంచి లివర్‌ తీసి.. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యత్తికి అమర్చారు. పది రోజుల పర్యవేక్షణ తర్వాత ఆ లివర్‌ బాగానే పనిచేస్తోంది అంటూ వైద్యులు ప్రకటించారు.

చైనాలోని ఫోర్త్‌ మిలిటరీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన కై-షాన్ టావో, జావో-జు యాంగ్, జువాన్ జాంగ్, హాంగ్-టావో జాంగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ చేశారు. “జీన్-మోడిఫైడ్ పిగ్-టు-హ్యూమన్ లివర్ జెనోట్రాన్స్ప్లాంటేషన్” అనే శీర్షికతో ఈ అధ్యయనం మార్చి 26, 2025న నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. “ఈ అధ్యయనంలో కఠినమైన పర్యవేక్షణలో, మేము ఆరు జన్యువులు సవరించిన పంది నుండి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి కాలేయాన్ని జెనోట్రాన్స్ప్లాంట్ చేశాం” అని వైద్యులు ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. అయితే ఈ శస్త్రచికిత్స అధికారికంగా మార్చి 10, 2024న జరిగింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి కుటుంబ సభ్యుల అంగీకారంతో వైద్యులు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఆపరేషన్‌ పూర్తి అయిన తర్వాత.. ఓ పది రోజుల పాటు మనిషిలో ఆ లివర్‌ ఎలా పనిచేస్తోంది, రక్తం ప్రవాహం, పిత్త ఉత్పత్తి, రోగనిరోధక ప్రతిస్పందన, ఇతర కీలక విధులను పర్యవేక్షించారు.

కొన్ని సార్లు మనిషి శరీరం ఇలాంటి ఇతర జీవాల అవయవాలను తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం పంది లివర్‌ అద్భుతంగా పనిచేస్తోందని, పది రోజులు పర్యవేక్షణ తర్వాత వైద్యులు ధృవీకరించారు. అలాగే కీలకమైన ప్రోటీన్ అల్బుమిన్‌ను ఉత్పత్తి చేసిందని జియాన్ వైద్యులు వెల్లడించారు. ఈ ప్రయోగం ఎన్నో ఆశలు రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది భారీ ఊరటను ఇచ్చే అంశమని వైద్యులు అంటున్నారు. లివర్‌ మార్పిడి ఆపరేషన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదురుచూస్తున్నారని, కానీ, వారికి దాతలు దొరకడం లేదని, ఒక వేళ ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్‌ అయితే.. భవిష్యత్తులో జన్యుపరంగా కొన్ని మార్పులు చేసిన పంది లివర్‌ను మనుషులకు అమర్చే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.