Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం

|

May 28, 2021 | 10:09 AM

Good News: కోవిడ్‌ రోగులకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. మోనోక్లోనల్‌ యాంటీబాడీల రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసా ఇస్తోంది. మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని

Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం
Follow us on

Good News: కోవిడ్‌ రోగులకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. మోనోక్లోనల్‌ యాంటీబాడీల రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసా ఇస్తోంది. మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వెల్లడి కావడంతో భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతి ఇచ్చింది. 2 లక్షల డోసులను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేటు ఔషధ సంస్థకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్స పొందడం ద్వారా 7 నుంచి 10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి తొలగిపోతుంది.

ఈ యాంటీబాడీలు ఏమిటి..?

శరీరంలో చాలా రకాల యాంటీబాడీలు ఉంటాయి. వైరస్‌కు వ్యతిరేకంగా పని చేసే కొన్ని మాత్రమే ఉంటాయి. అటువంటి వాటిలో టసిరిబిమాట్‌, ఇమిడెవిమాబ్‌ అనే రెండు రకాలున్నాయి. వాటిని సేకరించి కొత్త యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. ఇలా ప్రత్యేకంగా ఒకటి రెండు రకాలను మాత్రమే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అంటారు. ఈ రెండూ ఇంజక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి ఐవీ ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70వేల వరకూ ఉంటుంది. ప్లాస్మాథెరపీలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి.

ఎప్పుడు ఇవ్వాలి..

వైరస్‌ లక్షణాలు కనిపించిన 3-7 రోజుల్లోపు ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలి. దీని ద్వారా 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి లేకుండా పోతుంది వైరస్‌ సోకిన 10 రోజుల తర్వాత ఇస్తే అంత సానుకూల ప్రభావం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరంలో వైరస్‌ తీవ్రత బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇంజక్షన్‌ ఇవ్వాలంటే ముందు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయించాలి. అందులో ‘సైకిల్‌ త్రెషోల్డ్‌(సీటీ)’ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎన్ని సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తించారనేది ముఖ్యం.

ఎవరికి ఇవ్వకూడదు..

ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్‌ సాయంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి.. అవయవాలు దెబ్బతిన్నవారికి.. గర్భిణులకు కూడా ఇవ్వకూడదు. మోనోక్లోనల్‌ చికిత్స పొందినవారిలో 70-80 శాతం మంది 3-4 రోజుల్లో కోలుకుంటారు.  ఈ యాంటీబాడీలు శరీరంలోకి వెళ్లిన తర్వాత.. కొవిడ్‌ స్పైక్‌ ప్రోటీన్‌కు.. శరీర కణాలకు మధ్య ఇవి అడ్డు గోడగా నిలుస్తాయి.

కరోనాతో పోరాటం చేస్తూ కోవిడ్ ను జయించిన వారు..

కోవిడ్ ను జయించిన 21 రోజు శిశువు

ఇప్పటి వరకు కరోనాతో పోరాటం చేస్తూ ఎంతో మంది జయించారు. అందులో కొందరిని ఇక్కడ ప్రస్తావించాము. ఉత్తరప్రదేశ్‌ లోని మేరఠ్ జిల్లా, కస్బా మావానా మండలానికి చెందిన శిశువు కూడా కరోనాను జయించింది. 21 రోజుల శిశువుకు ఆనారోగ్యం ఉండటంతో కుటుంబ సభ్యులు స్థానిక నుత్రిమా ఆస్పత్రిలో చేర్చారు. శిశువుకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. 18 రోజుల్లో కరోనాను జయించింది.

కరోనాను జయించిన 102 వృద్ధురాలు

102 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు కరోనాని జయించి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం చైతన్య కాలనికి చెందిన పెరిపోగు కృష్టయ్య భార్య అనమ్మ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. మూడు వారాల క్రితం ఆమెకు, ఆమె కుమారుడు కోటేశ్వరరావుకి కరోనా సోకడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్​అసుపత్రిలో చికిత్స పొందిన వృద్ధురాలు ఎట్టకేలకు కరోనాను జయించింది.

72 ఏళ్ల వృద్ధురాలు..

72 ఏళ్ల వృద్ధురాలు కూడా ఎట్టకేలకు కరోనాను జయించింది. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారం రోజుల్లోనే ఆమెకు నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. మల్కాజిగిరిలోని పీవీఎన్‌ కాలనీకి చెందిన 72 సంవత్సరాల వృద్ధురాలికి వారం రోజుల కిందట కరోనా బారిన పడింది. ఇక కుటుంబ సభ్యులు మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి గాంధీ దవాఖానాకు తీసుకెళ్లాలని సూచించారు. గాంధీకి తీసుకెళ్లగా, ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించారు. వారం రోజుల్లో కోలుకొని మంగళవారం వృద్ధురాలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యింది.

కరోనాను జయించిన మరో చిన్నారి

కరోనా బారిన పడిన 10 నెలల చిన్నారి కరోనాను జయించాడు. ఆదిలాబాద్‌ జిల్లా తాంసికి చెందిన ఇప్ప సంతోష్‌-సౌర్ణిమల కుమారుడు శ్రీ యాష్‌. సంతోష్‌ భీంపూర్‌ మండలం పరిషత్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల వీరికి కరోనా రాగా, చికిత్స పొందుతూ కోలుకున్నారు. తర్వాత వీరి పది నెలల బాబు శ్రీయాష్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోకి కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. దాతల ఆర్థికసాయం, ఎమ్మెల్సీ కవిత చొరవతో మెరుగైన వైద్యం అందడంతో కోలుకున్నాడు.

110 ఏళ్ల వృద్ధుడు..

కరోనా నుంచి 110 ఏళ్ల వ్యక్తి కరోనాను జయించాడు. అది కూడా హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న గాంధీ ఆస్పత్రిలో. కరోనా పేరెత్తితేనే భయంతో వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామానంద అనే 110 ఏళ్ల వ్యక్తి కరోనాను జయించడం కొండంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలోనే అతిపెద్ద వయసు గల వ్యక్తి కరోనాను జయించాడని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజా రావు ప్రకటన విడుదల చేశారు.

ఇవీ కూడా చదవండి:

White Fungus: వైట్‌ ఫంగస్‌ సోకిన వారిలో ప్రేగులకు రంధ్రాలు.. ప్రపంచంలోనే తొలి కేసు నమోదు

Black Pepper : మిరియాల ఘాటు ఆరోగ్యానికి మంచిదే..! ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరైన మార్గం..