Digestive system: జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వీటిని తినండి.. సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి..!

|

Mar 26, 2022 | 7:28 AM

Healthy Digestive system: బలహీనమైన జీర్ణవ్యవస్థ మన శరీరంలోని అనేక సమస్యల కారణం అవుతుంది. మనం తినేది సరిగ్గా జీర్ణం అయితే

Digestive system: జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వీటిని తినండి.. సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి..!
Health Diet
Follow us on

Healthy Digestive system: బలహీనమైన జీర్ణవ్యవస్థ మన శరీరంలోని అనేక సమస్యల కారణం అవుతుంది. మనం తినేది సరిగ్గా జీర్ణం అయితే, ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, జీర్ణం అవకపోతే.. లేనిపోని రోగాలన్నీ వెంటాడుతాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే ఉదర సంబంధిత సమస్యలు నిత్యం వేధిస్తుంటాయి. ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో అనారోగ్యానికి దారితీసే ఆహారం, అసహజ జీవనశైలి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రజలు ఏమాత్రం ఆలోచించకుండా ఏది పడితే అది తినేయడం ఈ సమస్యకు కారణం. ఫలితంగా ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్‌ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావితమైనప్పుడు, మైకం, వాంతులు, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. తరచుగా అలసట అనిపిస్తుంటుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన దినచర్యతో పాటు మంచి ఆహారాన్ని కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే తినే ఆహారం మంచి ఫుడ్‌ను చేర్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు..
వేసవి కాలంలో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. దీంతో పాటు, పెరుగు వినియోగం చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, పెరుగు తినడానికి సరైన సమయం కూడా ఉండాలి. మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.

బొప్పాయి..
బొప్పాయి ఉదర సంబంధిత అన్ని వ్యాధులను నయం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే డైజెస్టివ్ ఎంజైములు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, ఇ, ఎ, అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తాయి. భారీ ఆహారాన్ని సైతం సులభంగా జీర్ణం చేయగల సామర్థ్యం బొప్పాయి ప్రత్యేకత. ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ ప్రభావవంతమైన ఫలితాన్ని చూపుతుంది.

ఆపిల్..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక యాపిల్ తినాలని చెబుతారు. అనేక పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఆపిల్, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. యాపిల్‌లో శరీరానికి ఎంతో మేలు చేసే ఫైబర్‌ ఉంది. అందుకే రోజూ ఒక యాపిల్ తింటే ఎన్నో రోగాల బారి నుంచి బయటపడతారు. మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో కూడా అద్భుతమైన ప్రభావం చూపుతుంది.

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..